Advertisement
తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఉన్న బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ లో మెగా కుటుంబం కూడా ఒకటి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కుటుంబం అంటే వీళ్ళల్లా కలిసి ఉండాలి అనే విధంగా మెగాస్టార్ చిరంజీవి అందరినీ కలిపి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచారు. ఒకప్పుడు మెగా హీరోలు అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇప్పుడేమో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్ ఇలా అంతా మెగా హీరోలుగా వచ్చారు. ఇండస్ట్రీలో కొనసాగితెస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో చాలా రచ్చ ఇప్పుడు నడుస్తోంది. ఏపీలో జరుగుతున్నటువంటి రీసెంట్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన పని మెగా అభిమానుల్లో పెద్ద చిచ్చు తీసుకొచ్చింది.
Advertisement
అయితే కుటుంబం విలువలు మర్చిపోకూడదు కానీ దానిని అల్లు అర్జున్ ఒక స్టేజ్ కి వచ్చాక మర్చిపోయారు అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. మెగా హీరోస్ విషయంలో అల్లు అర్జున్ కి సమానమైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే. పాన్ ఇండియా వరకు ఏమో గాని గ్లోబల్ గా అయితే చరణ్ కి మరింత ఫేమ్ ఉంది. అయినా కూడా చరణ్ ఎంతో సౌమ్యంగా ఉంటాడని అభిమానులు అంటారు. చరణ్ అల్లు అర్జున్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ నా మనసుకి నచ్చింది చేస్తాను అని.. ఫ్రెండ్ కోసమైనా ఇంకెవరి కోసమైనా అంటూ మరోసారి అన్నారు. ఇది చల్లారింది అనుకుంటే కాంట్రవర్సీ మళ్ళీ రేగింది.
Advertisement
Also read:
Also read:
ఎంత కాదన్నా అవునన్నా మేము ఒకటే రక్తానికి చెందిన వాళ్లమని.. మా నుంచి దాన్ని ఎవరూ వేరు చేయలేరు. అది కష్టమని చరణ్ అన్నారు. మా బాబాయి నాన్నగారి విషయంలో ఇది బాగా కనపడుతోంది అని అన్నారు. కుటుంబ విలువలు ఎప్పుడు మర్చిపోకూడదంటూ మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ చరణ్ ఎలా అయితే కొణిదెల కుటుంబం కలిసి ఉండాలి అనుకుంటున్నాడో అలా అల్లు అర్జున్ కూడా ఇన్నాళ్లు తన మీద ఉన్న మెగా స్టాంప్ పక్కన పెట్టి అల్లు ఫ్యామిలీకి గుర్తింపు ఉండాలని చేస్తున్నాడు అనుకోవచ్చుగా అని అంతా అంటున్నారు. మరి ఎప్పుడు వీటికి ముగింపు ఉంటుందో చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!