Advertisement
మెగా అల్లు కుటుంబ సభ్యుల్ని వేరువేరుగా ఓ మెగా అభిమాని చూడడం ఇప్పటివరకు కూడా జరగలేదు. ఒక మెగా అభిమాని చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఎంతగా అభిమానిస్తారో అల్లుఅర్జున్ ని కూడా అలాగే అభిమానిస్తారు. అయితే అల్లు అర్జున్ కారణంగా కుటుంబం రెండుగా విడిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి భవిష్యత్తులో ఏదైనా సందర్భం వచ్చినా మళ్ళీ కలిసిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితులు వాటికి అనుకూలంగా లేవు.
Advertisement
అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్లి తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికి సపోర్ట్ చేయడం నుంచి ఈ వివాదం మొదలైంది. ఈ గొడవ తగ్గింది అనుకుంటే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఆరిపోయిన మంటలను మళ్ళీ చెలరేగేటట్టు చేశారు. ఆయన మావయ్య చంద్రశేఖర్ రెడ్డి కూడా లైవ్ డిబేట్స్ కి వచ్చి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం.. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై మండిపడ్డారు. అల్లు అర్జున్ కి అభిమానులు ఉంటారని మీరు చెప్తేనే నాకు తెలిసిందని ఆయన స్థాయిని మించి మాట్లాడతాడు అంటూ విమర్శలు చేశారు.
Advertisement
Also read:
పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల యూట్యూబ్ ఛానల్ లో చిరంజీవి గారి మామయ్య అల్లు రామలింగయ్య చిరంజీవి సినిమా ప్లాప్ వచ్చినప్పుడు ఎలా స్పందించారో చెప్పారు. చిరంజీవి స్టేట్ రౌడీ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఫ్లాప్ అయిందని అల్లు రామలింగయ్య కి ఎవరో చెప్పారట. సెట్స్ లోకి వచ్చి స్టేట్ రౌడీ ఎగిరిపోయిందని పెద్దగా అరుస్తూ ప్రచారాలు చేశాడు. దీనికి చిరంజీవి చాలా బాధపడ్డారట. ఏంటి మా మామయ్య ఇలా అంటున్నారు అని విచారంగా ముఖం పెట్టారు. అప్పుడు ఆ చిత్ర నిర్మాతలు చిరంజీవి గారిని కలిసి మొదటి వారంలో స్టేట్ రౌడీ రాబట్టిన వసూలు రికార్డ్స్ గురించి చెప్పి థియేటర్లో ఆడుతుందని చెప్పారట. అది విన్న చిరంజీవి గారు కోపంగా అల్లు రామలింగయ్య గారి వైపు చూశారు. అప్పుడు ఆయన నాకేం తెలుసు ఎవరో చెప్పారని నేను ఇక్కడ చెప్పానని అన్నారు ఆ సంఘటనని పరుచూరి గుర్తు చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!