Advertisement
నందమూరి నటసింహ బాలయ్య తాతమ్మ కల మూవీ తో ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఈనెల 30వ తేదీతో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. అయితే ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ తరపున ప్రముఖులంతా గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తో పాటుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్ వంటి వారికి ఆహ్వానం అందింది. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇలా ప్రముఖులు అందరికీ కూడా ఆహ్వానాన్ని పంపించారు.
Advertisement
అయితే వేడుకలకు ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆహ్వానించలేదు అని తెలుస్తోంది. వాళ్ళు ఎవరో కాదు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్. 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత తారక్ టీడీపీ పార్టీకి దూరం అయ్యారు వైయస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేసిన సమయంలో కూడా స్పందించలేదు. మౌనంగానే ఉండిపోయారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చంద్రబాబు, లోకేష్, బాలయ్య పై అవాకులు చవాకులు పేలారు.
Advertisement
Also read:
వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తారకపై ఉన్నా ఆయన ఏ ప్రయత్నం చేయలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ అంటేనే మండిపడుతున్నారు. కళ్యాణ్ రామ్ కి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నిటిని తారక్ తీర్చడంతో ఎన్టీఆర్ మాటను అతను దాటట్లేదు. అందరికీ ఆహ్వానం అందింది కానీ వీళ్ళిద్దరికీ ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఒకవేళ పిలిస్తే వారు వస్తారా అనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటివరకైతే వీరిద్దరికి ఆహ్వానం అందలేనట్లు తెలుస్తోంది. మరి ఏమవుతుంది అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!