Advertisement
చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళ వంటి ఎన్టీఆర్ ఏఎన్నార్లు కెరియర్ ప్రయాణం నుంచి చనిపోయేదాకా అన్నదమ్ముల్లా ఉన్నారు. అక్కినేని తల్లి ఎన్టీఆర్ ను నూతన పెద్ద కొడుకుగా చూసి మురిసిపోయేవారు. ఈ విషయాన్ని చాలా సార్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చెప్పారు. ఎంతటి ప్రాణ స్నేహితులైనా అప్పుడప్పుడు విభేదాలు వస్తూ ఉంటాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య కొందరు పుల్లలు పెట్టి విభేదాలను సృష్టించారు. అన్నగారు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Advertisement
తండ్రులు అడుగుజాడల్లోనే వారి పిల్లలు బాలకృష్ణ, నాగార్జున కూడా నడిచి సోదర భావంతో మెలిగారు. రెండు కుటుంబాల్లోని వ్యక్తులు ఇప్పటికే అన్నదమ్ముల కలిశారు. ఒకరి ఇంట్లో నుంచి మంచి చెడుకు మరొకరు వస్తున్నారు. అయితే ఏం జరిగిందో కానీ నాగార్జున బాలయ్య మధ్య గ్యాప్ వచ్చింది. నాగేశ్వరావు చనిపోతే మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ అన్నపూర్ణ కాంపౌండ్ కి తరలి వెళ్లారు. తాను తండ్రి తర్వాత తండ్రిలా అభిమానించే బాబాయ్ ని చివరి చూపు కూడా చూడలేదు బాలకృష్ణ. కారణం ఏంటో ఇప్పటికి కూడా తెలియదు. నాగార్జున బాలయ్యలను ఒకే వేదికపై చూసి చాలా ఏళ్లవుతుంది.
Advertisement
Also read:
Also read:
అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టిన సామ్.. అందుకే చైతూకి లక్ష్మీ దూరం..?
బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 3ని నాగార్జున తోనే మొదలు పెట్టాలని అల్లు అరవింద్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. బాలయ్య సినీ కెరియర్ 50 ఏళ్ళు గడిచిన సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్లో మెగా ఈవెంట్ జరగబోతోంది. ఈవెంట్ కి అందర్నీ ఆహ్వానించారు. నాగార్జునకి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది మరి ఆయన వస్తారా లేదో చూడాలి. కానీ సెప్టెంబర్ ఒకటిన ఈవెంట్ జరిగే సమయంలోనే స్టార్ మా లో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ ఉంది. దీనిని ముందుగానే టెలికాస్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో లైవ్ కూడా ఉండొచ్చు. మరి నాగార్జున బిజీగా ఉండి వెళ్ళారా అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!