Advertisement
చంద్రబాబు నాయుడు ప్రయత్నం ఫలించింది. విజయవాడకు పవర్ బోర్డ్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కేంద్రంతో చంద్రబాబు సహాయక చర్యల విషయాలపై మాట్లాడారు. పవర్ బోర్డ్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపించాలని ఆయన కోరారు దీంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ పంపించారు. మరోవైపు లుధియానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడ నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో బోట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి.
Advertisement
100 మందితో ఈ బృందాలు విజయవాడకి చేరుకున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు వేగవంతం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు.
Advertisement
Also read:
Also read:
పాల ప్యాకెట్లతో పాటుగా ఆహారం, వాటర్ బాటిల్స్ ని ప్రభుత్వ అందిస్తోంది. ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారాన్ని సమకూర్చుతోంది. ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటనతో సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షించారు. చంద్రబాబు సూచనలతో అధికార యంత్రాంగం సైతం వేగంగా పనులు జరుపుతోంది. ఎప్పటికప్పుడు సమీక్షలను నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాత్రి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు బాధితులని పరామర్శించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!