Advertisement
పెళ్లి తర్వాత భార్యాభర్తలు కలిసి సుఖంగా ఉండాలని అనుకుంటారు. ఎవరూ కూడా ఇబ్బందులు పడాలని, కష్టాలు రావాలని అనుకోరు. పెళ్లి తర్వాత భార్య భర్తలు చేసే పొరపాట్ల వలన భార్యాభర్తల మధ్య బంధం పాడవుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా భార్య భర్తలు ఈ తప్పులు చేయకూడదు. దీని వలన అనవసరంగా వారి మధ్య గొడవలు వస్తాయి. భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు. అలా చేయడం వలన వారికి ఇబ్బంది కలగమే కాకుండా వారి మధ్య గ్యాప్ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఏ విషయంలో జలస్ ఉండకూడదు.
Advertisement
వారు ఏదైనా సక్సెస్ సాధించేటప్పుడు వారి వెంట ఉండే దానిని ఎంజాయ్ చేయాలి. అంతేకానీ వారి సక్సెస్ ని చూసి జెలస్ పడడం, గొడవలు పెట్టుకోవడం వంటివి చేయకూడదు. అలాగే భార్యాభర్తలు ఎక్కువగా ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి దానిని రీచ్ అవ్వకపోతే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి.
Advertisement
Also read:
Also read:
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం ఉండకూడదు. అనుమానం అనేది పెనుభూతం వంటిది దీని వలన చాలామంది భార్య భర్తలు విడిపోయే పరిస్థితికి చేరుకున్నారు. కాబట్టి అనుమానాన్ని పెంచుకోవద్దు. ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. ఒకరితో ఒకరు ఆనందంగా ఉండడం చేయాలి. అలాగే ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని కూడా డైరెక్ట్ గా మాట్లాడుకోవాలి. ఒకరి కోసం ఒకరు సమయాన్ని ఇవ్వాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది. జీవితంలో హాయిగా ఉండవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!