• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే వచ్చే కష్ట నష్టాలు ఇవేనా ?

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే వచ్చే కష్ట నష్టాలు ఇవేనా ?

Published on January 11, 2023 by karthik

Advertisement

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఒక మధురమైన ఘట్టం. తల్లిదండ్రులు తమ బిడ్డలకోసం సంబంధాలు చూసేటప్పుడు ముందుగా ఉద్యోగం ఉందా? ఆస్తులు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తారు. కానీ వయసును పెద్దగా పట్టించుకోరు. సాధారణంగా అబ్బాయిల వయసు కన్నా అమ్మాయిల వయసు తక్కువగా ఉంటుంది. ఎక్కడో లక్షల్లో ఒకరు ఇద్దరు తమకన్నా పెద్దవారైనా అమ్మాయిలను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే ఐదేళ్ల వరకు ఏజ్ గ్యాప్ ఉంటే పెద్దగా సమస్య లేదు కానీ.. 15 ఏళ్ల గ్యాప్ వచ్చిందంటే భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Read also: “అక్కినేని ఫ్యామిలీ” పేర్ల‌కు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? దానికి కారణం ఏంటి !

Advertisement

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉండడంవల్ల పిల్లలను కనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయట. అంతేకాక ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే అది విడాకులకు దారితీస్తుందని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఈ మేరకు పలువురు సైంటిస్టులు చేపట్టిన వేర్వేరు అధ్యయనాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. ఏడాది క్రితం న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాలా ఇంగ్లాండ్ బృందం 3622 జంటలపై ఈ అధ్యాయనం చేసింది. అయితే ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఎక్కువగా విడాకులు కోరుతున్న జంటలలో పురుషుల సంఖ్య 87% ఉందని తెలిపారు. కొన్ని జంటలలో భార్యల వయసు కన్నా భర్తల వయసు ఐదేళ్లు ఎక్కువగా ఉంటుందని.. అలాంటి వారిలో భర్తలు ముందుగా విడాకులు కోరుతున్నారని తెలిపారు.

భార్య తన కన్నా ఎక్కువ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని, పరిపక్వతతో ఆలోచిస్తుందని భావించే వయసు ఎక్కువ ఉన్న భర్తలు ముందుగా విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు. భార్యాభర్తల మధ్య ఐదేళ్ల కన్నా ఎక్కువ గ్యాప్ ఉండడం మంచిది కాదని చెబుతున్నారు. వయసు ఎక్కువగా ఉన్న భర్త చెప్పే విషయాలను వయసు తక్కువగా ఉన్న భార్య అర్థం చేసుకోలేకపోతుందని.. అందుకనే భర్తలు విడాకులు కోరుతున్నాడని వెళ్లడైంది. అలాగే 23 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునేవారు త్వరగా విడకులు తీసుకుంటున్నారని వెల్లడించారు. 24 నుంచి 30 ఏళ్ల మధ్య వివాహం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Read also: బిర్యానీకి ఆ పేరు ఎలా వ‌చ్చింది.! HYD బిర్యానీని ప‌రిచయం చేసింది ఎవరు ?

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd