Advertisement
గాడ్ ఫాదర్ లేకుండా సినీ పరిశ్రమలో రాణించడం అంత ఈజీ కాదు. ట్యాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే నిలదొక్కుకుంటారు. నటుడుగా ఎదిగే క్రమంలో చేతికి వచ్చిన ప్రతిపాదనని కూడా చేస్తూ ఉంటారు. సపోర్టింగ్ రోల్స్ నుంచి హీరో వరకు విజయ్ సేతుపతి తాను ఏంటో నిరూపించుకున్నాడు.. తమిళనాడు రాష్ట్రంలోని పుట్టాడు విజయ్ సేతుపతి. నటుడు కావాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాడు. వేషాల కోసం స్టూడియోలు చుట్టూ తిరిగాడు 1996లో విడుదలైన లవ్ బర్డ్స్ సినిమాలో ఒక చిన్న రోల్ చేశాడు. ఆ మూవీలో ప్రభుదేవా నగ్మా హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తరవాత ఓ సినిమా చేసాడు.
Advertisement
ఆ తర్వాత 8 ఏళ్లపాటు ఒక్క సినిమా కూడా చేయలేదు. 2004లో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చాడు. 2010 వరకు అడపాదడప చిత్రాల్లో ప్రాధాన్యత లేని పాత్రలు చేశాడు. 2012లో విడుదలైన పిజ్జా మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ సేతుపతి నటనకి ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. పిజ్జా చిత్రంలో నటనకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.
Advertisement
Also read:
హీరోగా వరుస చిత్రాలు చేశాడు. హీరో పాత్రలకే కట్టుబడకుండా విలక్షణ రోల్స్ కూడా చేస్తూ ఉంటాడు. యాక్టర్ గా మారాడు. సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్ర పోషించాడు. ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. హిందీలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేశాడు సూపర్ డీలక్స్ చిత్రంలో ఆయన నటనకి గాను సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో జాతీయ అవార్డు వచ్చింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!