Advertisement
డాన్స్ మాస్టర్ జానీ పై లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొద్ది కాలంగా జానీ మాస్టర్ లైం*గికం*గా వేధిస్తున్నారని మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు తొలత నార్త్ ఇండియాలో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్ళిన పోలీసులను జానీ మాస్టర్ బురిడీ కొట్టించి పారిపోయారు. 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆయన కోసం పోలీసులు గాలించారు. జానీ మాస్టర్ లడక్ లో ఉన్నట్లు సమాచారంతో పోలీసులు లడక్ బయలుదేరారు మరోపక్క మైనర్ బాలికపై అ*త్యాచా*రం చేశారని ఆరోపణలతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు అయింది.
Advertisement
Advertisement
తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. 6 నెలల క్రితం సదరు మహిళలతో జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాలని తెలుస్తోంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడం వలన వేరే కొరియోగ్రాఫర్ టీం లోకి సదరు మహిళా కొరియోగ్రాఫర్ వెళ్లారు. ఓ పెద్ద హీరో సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్లి జానీ మాస్టర్ ఆమెతో గొడవ పడినట్లు తెలుస్తోంది ఆ దర్శకుడు వాళ్ళిద్దర్నీ పిలిచి రాజీ చేసుకోవాలని సూచించారు.
Also read:
కుదరకపోతే మీ పని మీరు చేసుకోండని అంతేకానీ ఇలా రోడ్డున పడి అల్లరి చేయొద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినా తీరు మార్చుకొని జానీ మాస్టర్ మహిళ కొరియోగ్రాఫర్ ని వేధిస్తు ఉన్నారు. విసిగిపోయిన ఆమె పోలీసులకి కంప్లైంట్ చేసింది జానీ మాస్టర్ లైం$గిక వేధింపులు పై సినీ ఇండస్ట్రీ సీరియస్ గా రియాక్ట్ అయింది అతని డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!