Advertisement
జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. మార్నింగ్ షో లు చూసిన ప్రేక్షకులు బెటర్ టాక్ చెప్పారు. ఎందుకు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది అంటే చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. దేవర సినిమా పాజిటివ్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే.. ఎన్టీఆర్ పర్ఫామెన్స్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో బాలన్స్ గా నటించి మెప్పించారు. దేవర గెటప్ లో అయితే ఎన్టీఆర్ చాలా బాగున్నారు. ఆ పాత్రని దర్శకుడు డిజైన్ చేసిన విధానం కూడా అద్భుతంగా ఉంది.
Advertisement
సెకండ్ పార్ట్ కూడా ఆ పాత్ర చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. ఫ్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి మాసీగా ఉంది. దేవర చేసిన డాన్స్ కూడా అందర్నీ మెప్పించింది. ఇంటర్వెల్ ఫైట్ కూడా ఊర మాస్ లాగ ఉంది. రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంది. దేవరకి ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగా కుదిరిందని చెప్పొచ్చు. అలాగే చుట్టమల్లే సాంగ్ ని బాగా షూట్ చేశారు. సీరియస్ గా సాగుతున్న డ్రామాలో ఈ పాట ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ని ఇచ్చింది.
Advertisement
Also read:
Also read:
అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. టైటిల్ కార్డ్స్, ఇంట్రడక్షన్ సీన్ ఇలా అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక మైనస్ పాయింట్స్ గురించి చూస్తే.. దేవర కథ కొత్తగా ఏమీ ఉండదు. చాలా పాత సినిమాల్లో చూసిన కథ ఇదే. సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్స్ చూస్తే హీరోయిన్ జాన్వి కపూర్ ఎంట్రీ సెకండ్ హాఫ్ వరకు రాదు. ఆమె పాత్రకి కథలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ ఉంది క్లైమాక్స్ బాగా డిజైన్ చేసారు.లాస్ట్ సీన్ అతికించినట్లు ఉంటుంది సెకండ్ హాఫ్ లో వచ్చే ఆయుధపూజ ఫైట్స్ బాగా డిజైన్ చేసి ఉంటే మాస్ ఆడియన్స్ విజువల్స్ బాగా ఎట్రాక్ట్ అయ్యుండేవారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!