Advertisement
కొండా సురేఖ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. అక్కినేని కుటుంబం పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని రేపుతున్నాయి. పెను దుమారానికి దారి తీస్తున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆమె తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు కూడా. సినీ ప్రముఖులు అస్సలు ఊరుకోవట్లేదు. ఏపీ డిప్యూటీ సీఎం తో పాటు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏంటని అంతా అంటున్నారు.
Advertisement
Advertisement
కేటీఆర్ పై కామెంట్లు చేసిన తరుణంలో కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసారు. సమంత నాగచైతన్య విడాకులకి కేటీఆర్ కారణమని ఆరోపణలు చేశారు. అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా తీవ్రంగా ఈ విషయంపై స్పందించారు. దాదాపు టాలీవుడ్ ప్రముఖులందరూ దీనిని ఖండిస్తూ అభిప్రాయాలను తెలిపారు. సినీ తారల జోలికి రావద్దని హెచ్చరించారు. కొద్దిరోజుల క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ కలిశారు. ఆత్మీయంగా సన్మానం కూడా పొందారు.
Also read:
హైడ్రా కూల్చివేతల్ని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డిని అభినందించారు. అదే క్యాబినెట్ కి చెందిన ఓ మహిళ మంత్రి చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంతో పాటు నటిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ ముందు స్పందిస్తారని అంతా అనుకున్నారు కానీ ఈ వివాదం జరిగి సదరు మంత్రి తన మాటల్ని ఉపసంహరించుకున్న పవన్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం ఏంటా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. పవన్ మామూలుగా మహిళల అభ్యున్నతి గౌరవ మర్యాదల గురించి మాట్లాడతారు. అలాంటిది సమంత వివాదంలో ఎందుకు మాట్లాడలేదు అనేది ఇప్పుడు ప్రశ్న.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!