Advertisement
చాలామంది ప్రతిరోజూ పాలు తీసుకుంటూ ఉంటారు. ఉదయం, సాయంత్రం కూడా చాలా మంది పాలు తాగుతారు. అయితే పాలు తీసుకునేటప్పుడు మాత్రం కొన్ని పొరపాట్లు చేయకూడదు. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పాలను తీసుకోవడం వలన క్యాల్షియం బాగా అందుతుంది. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. పాలు తాగేటప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. పాలు తాగేటప్పుడు పాలతో పాటు అరటిపండు తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండు కాంబినేషన్ మంచిది కాదు. ఈ రెండిటిని కలిపి ఒకేసారి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి.
Advertisement
కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా కలుగుతాయి. అలాగే పాలతో పాటుగా సిట్రస్ పండ్లను తినడం కూడా మంచిది కాదు. సిట్రస్ పండ్లను పాలతో పాటు తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు కలుగుతాయి. పాలతో పాటు వాటర్ కంటెంట్ ఉండే పుచ్చకాయ వంటి పండ్లను తీసుకోవద్దు. దీని వలన గ్యాస్ అతిసారం వంటి సమస్యలు వస్తాయి.
Advertisement
Also read:
కారంగా ఉండే ఆహార పదార్థాలను కూడా పాలతో పాటుగా తీసుకోవడం మంచిది కాదు. జీర్ణ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. చేపల్ని కూడా పాలతో పాటు తీసుకోవద్దు. ఎలర్జీ వంటివి కలుగుతాయి అలాగే పాలను గుడ్లను కలిపి తీసుకుంటే కూడా మంచిది కాదు. ఆకుకూరలు అయిన మెంతికూర, పాలకూర, బచ్చలి ఇలాంటివి కూడా పాలతో పాటు తీసుకోకూడదు. ఇలా చేయడం వలన క్యాల్షియం అందదు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!