Advertisement
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలల్లో నటిస్తున్నారు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకే వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రభాస్ తదుపరి ప్రాజెక్టులకు విషయానికి వస్తే.. ప్రస్తుతం సలార్, కల్కి 2, రాజాసాబ్ ఇలా చాలా సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో ప్రభాస్ ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పటి వరకు ఈయన పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండడం అభిమానుల్ని ఎంతగానో కలవరపెడుతోంది.
Advertisement
ప్రభాస్ ఇప్పటికే పెళ్లి వయస్సు దాటిపోయినా పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ప్రభాస్ పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవి మాట్లాడుతున్నప్పటికీ ప్రభాస్ పెళ్లి మాత్రం జరగడం లేదు. మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి తన పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలని పురస్కరించుకుని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఇంద్రకీలాద్రి పై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.
Advertisement
Also read:
అమ్మవారి దర్శనం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు కృష్ణంరాజు గారి దీవెనలు ప్రభాస్ పై ఎప్పుడూ ఉంటాయని.. ప్రభాస్ పెళ్లి జరుగుతుంది త్వరలోనే అని అన్నారు. ఆ నాడు తప్పకుండా ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆహ్వానిస్తాము అని ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి శ్యామలాదేవి అన్నారు. ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!