Advertisement
చాలామంది హెయిర్ కలర్ వేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు చాలా సమస్యలు వస్తాయి. హెయిర్ కలర్ వాడడం వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మీకు తెలుసా..? జుట్టు రంగు కొన్నిసార్లు ప్రతిచర్యకు కారణం అవుతుంది. చర్మం ఎర్రగా మారిపోవడంతో పాటుగా అసౌకర్యం, దురద ఇలా చాలా సమస్యలు వస్తాయి. ఎప్పుడైనా రంగు వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే జుట్టు రంగులో ఉన్న రసాయనాలు కుదుళ్ళ నుంచి తేమను దూరం చేస్తాయి దీంతో జుట్టు నుంచి తేమ దూరం అయిపోతుంది. మెరుపుని కోల్పోతుంది.
Advertisement
తలపై ఎర్రటి దద్దుర్లు వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. జుట్టుకి రంగు వేసుకోవడం వలన చుండ్రు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే తలకి రంగు వేసుకుంటే ఎలర్జీ, ఆస్తమా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రంగులలో వాడే కెమికల్స్ వలన ఇలా జరుగుతూ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
Advertisement
Also read;
తెల్ల జుట్టును దాచుకోవడానికి రంగు వేసుకుంటూ ఉంటారు కానీ దీని వలన కొందరిలో ఎలర్జీ వంటి ఇబ్బందులు వస్తాయి. జుట్టు రాలిపోతుంది. జుట్టు చిట్లిపోవడం, జుట్టు బలహీనంగా మారిపోవడం ఇలాంటివి కలుగుతాయి. కళ్ళల్లో పడితే కళ్ళ కలకలు వచ్చే అవకాశం ఉంటుంది. వాపు కంటి కింద వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. తరచుగా రంగు వేసుకోవడం వలన క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుందని వైద్యులు అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!