Advertisement
నారా రోహిత్ విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. బాణం మూవీతో పరిశ్రమకు పరిచయమయ్యారు ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. తర్వాత నుంచి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు రెండవ కొడుకు రోహిత్ రోహిత్ కి శిరీష్ అనే అన్న ఉన్నాడు. అతను కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వయసు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు కుటుంబ పరిస్థితుల్లో కారణంగా పెళ్లికి దూరంగా ఉన్నారు.
Advertisement
నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి జోక్యం చేసుకుని రోహిత్ కి సంబంధం కుదరచినట్లు తెలుస్తోంది. ఈనెల 13వ తేదీన హైదరాబాద్లో నిశ్చితార్థం జరగబోతుందట. చంద్రబాబు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ తదితర కుటుంబ సభ్యులు హాజరవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Also read:
వధువు ఎవరనే విషయాన్ని రహస్యంగా ఉంచినా ప్రతినిధి 2 సినిమాలో రోహిత్ పక్కన హీరోయిన్ గా నటించిన సిరి లేళ్ల అని తెలుస్తోంది. నారా వారి కుటుంబం నుంచి కానీ నందమూరి కుటుంబం నుంచి కానీ దీనిపై ఎలాంటి ఈ ప్రకటన రాలేదు. ఇప్పటికే సెలబ్రిటీలు అందరూ రోహిత్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రోహిత్ న్యూయార్క్ లోని ఫిలిం అకాడమీ నుంచి నటనలో కోర్స్ చేయడంతో పాటు మేకింగ్ కోర్సు కూడా పూర్తి చేశారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!