Advertisement
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర, రోజూ వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం, పోషకాహారం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎక్కువసేపు ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ మనకి హాని చేస్తుంది. కళ్ళకు మాత్రమే కాదు చర్మానికి కూడా ఆ తీవ్ర హానికరమని చాలా మంది అంటున్నారు. నిజంగా శరీరానికి కూడా ఈ బ్లూ లైట్ హాని కలిగిస్తుంద అనేది చూద్దాం.
Advertisement
దృశ్యమాన కాంతి వర్ణపటంలో ఒక భాగమే బ్లూ లైట్. దీనికి ప్రధాన వనరు సూర్యకాంతి. ప్రతి రోజు చాలా మంది ఉపయోగించే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీలు, స్మార్ట్ఫోన్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ బ్లూ లైట్ ని ఉత్పత్తి చేస్తుంటాయి. సూర్యుడి కంటే 100 నుంచి 1000 రెట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. బ్లూ లైట్ హైపర్ పిగ్మెంటేషన్ కి దారితీస్తుంది.
Advertisement
Also read:
ఈ లైట్ వలన చర్మం నల్లగా మారిపోతుంది. చర్మం పై నల్లని మచ్చలు కూడా వస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే బ్లూ లైట్ చర్మ నిర్మాణానికి ముఖ్యమైన ప్రోటీన్ అయినటువంటి కొల్లాజన్ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ ని ఒక గంట పాటు ఒక అంగుళం దూరంలో ఉంచి వాడితే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. బ్లూ లైట్ ని ప్రసవింప చేసే ఈ పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తే వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!