Advertisement
పద్మ శ్రీ అవార్డు గ్రహీత కిన్నెరా మొగలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 24వ తేదీన హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. పైగా ఆ స్థలం డాక్యుమెంట్లు సీఎం రేవంత్ రెడ్డి అందించారు. అయితే ఆ స్థలంలో మొగులయ్య కాంపౌండ్ వాల్ ను నిర్మించుకున్నాడు. ఆ కాంపౌండ్ వాల్ ను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేశారు. దీంతో ఈయన పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.
Advertisement
కిన్నెర మొగులయ్య తెలుగు జానపద పాటల తో ఎంతో మందిని ఆకట్టుకుని మంచి పేరుని పొందాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పుట్టిందయ్యా పులి పిల్ల అనే టైటిల్ సాంగ్ పాడి ఎంతో ఫేమస్ అయ్యాడు. ఈయనకు జానపద సంగీత కళాకారుడు గా పద్మశ్రీ అవార్డు లభించింది.
Advertisement
Also read:
దేవర కలెక్షన్స్ ఇక క్లోజ్ అవుతున్నాయా..?
దీంతో పాటుగా 600 గజాల స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ దీనిలో కాంపౌండ్ వాల్ నిర్మించిన 15 రోజులకే దుండగులు దానిని కూల్చివేశారు. దీంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు ఫైల్ చేసి వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని వేడుకున్నాడు. రాత్రికి రాత్రే ఈ విధంగా జరగడం తో కిన్నెర మొగలియ్య షాక్ కి గురయ్యాడు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!