Advertisement
తెలుగు నెలల్లో కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి కార్తీకమాసం త్వరలోనే రాబోతోంది. అయితే కార్తీకమాసంలో ఏమేం ఆచరిస్తే మంచిది..? కార్తీకమాసం విశిష్టత ఏంటి వంటి విషయాలని తెలుసుకుందాం. పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం. ఈ నెల రోజులు శివారాధన చేయడం వలన.. సోమవారాలు ఉపవాసాలు చేయడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసం నవంబర్ 2 నుంచి మొదలవుతుంది. అత్యంత మహిమాన్వితమైన మాసం ఇది పూజలు వ్రతాలు ఉపవాసాలకి అనుకూలంగా ఉంటుంది. పెద్ద ఎత్తున కార్తిక మాసంలో భక్తులు శివాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. రుద్రాభిషేకాలు బిల్వార్చనలో పాల్గొంటారు. అయ్యప్ప దీక్షల ప్రారంభం అయ్యేది కూడా కార్తీకమాసంలోనే.
Advertisement
Advertisement
కార్తీకమాసం మొదటి రోజు నుంచి మకర సంక్రాంతి దాకా దీక్షలు చేస్తారు ఇలా చేయడం వలన మంచి ఫలితం దక్కుతుందని భావిస్తారు. అభిషేకం చేయడం వలన దోషాలు, బాధలు తొలగిపోతాయి. బిల్వ దళాలతో శివునికి అర్చన చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఎంతో విశిష్టత ఉంది. కార్తీకమాసంలో పవిత్ర నది స్నానం ఆచరించడం కూడా మంచిదే శివాలయానికి వెళ్లి పూజలు చేసే వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి.
Also read:
దీపారాధనకి కూడా ఎంతో మహిమ ఉంటుంది. కార్తీక సోమవారం నాడు 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించి శివుడిని దర్శించుకుంటారు. కార్తీకమాసంలో భక్తులు మాంసాహారానికి, వెల్లుల్లి, ఉల్లి కి దూరంగా ఉండాలి వివాహిత స్త్రీలకు వైవిధ్యం రాకుండా పూజలు వ్రతాలు నోములు చేస్తారు. పైగా ఏడేడు జన్మల పుణ్యఫలం కూడా దక్కుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!