Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. అయితే ఈ డైరెక్టర్ తీసిన సినిమాలు అన్ని ఎంతో మంచి హిట్స్ ని పొందుతాయి. అంతేకాకుండా ఈయన తీసిన సినిమాలతో మంచి పేరును కూడా సంపాదించుకున్నారు. కమర్షియల్ గా విజయం సాధించని సినిమాలలో అయితే లీడర్ సినిమా ఒకటి అని చెప్పవచ్చు. ఈ సినిమా కథ బాగున్నా సరే కమర్షియల్ గా హిట్ కాలేదు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఎన్నో సినిమాలు ఫీల్ గుడ్ సినిమాలు గా నిలుచాయి. అయితే లీడర్ సినిమా కథ వెనుక ఒక కానిస్టేబుల్ ఉన్నారని డైరెక్టర్ అన్నారు. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ దీని గురించి డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు.
Advertisement
Advertisement
సమాజం విషయంలో, వ్యవస్థ విషయంలో ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది అని ఆయన అన్నారు. చదువుకున్న యువకుల్లో చాలామంది దీనికి సంబంధించి కోపం వస్తుందని మరియు చాలా మార్పులు జరగాలని ఆశిస్తారు అని ఆయన పేర్కొన్నారు.శేఖర్ కమ్ముల అమెరికాకు వెళ్లిన సమయంలో కార్ పార్కింగ్ కోసం ఇబ్బంది పడ్డారట. అయితే అమెరికాలో కానిస్టేబుల్స్ లైట్ ఫ్లాష్ చేస్తారని, అలా చేస్తే అక్కడ కార్ పార్క్ చేయకూడదని అర్థం.
Also read:
దీంతో ఈయన కానిస్టేబుల్ పై గౌరవంతో అక్కడ కారు పార్క్ చేయలేదు. కానీ అక్కడ పార్క్ చేస్తే కనుక టికెట్స్ జనరేట్ చేసి లైసెన్స్ తీసుకుంటారని తెలిపారు. మన దేశంలో మాత్రం పోలీసులకు కూడా భయపడకుండా రూల్స్ ని బ్రేక్ చేస్తారని, ఈ విధంగా లీడర్ కదా పుట్టిందని శేఖర్ కమ్ముల వెల్లడించారు. లీడర్ కధ వెనుక ఈ కానిస్టేబుల్ ఉన్నారని తెలిసిన నెటిజెన్లు ఎంతో ఆశ్చర్య పడుతున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!