Advertisement
జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. ఒత్తిడి వలన జ్ఞాపక శక్తి పై ప్రభావం పడుతుంది. అందుకని దీనిని తగ్గించుకోవడం కోసం ప్రతి రోజు ధ్యానం, యోగా వంటి పద్ధతుల్ని పాటించాలి. అలా చేయడం వలన మెదడు ఆరోగ్యం బాగుంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం కూడా ముఖ్యం. ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం వలన జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే లక్ష్యం లేకుండా ముందుకు వెళ్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
Advertisement
ఏదైనా ఒక గోల్ పెట్టుకుని దాని ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అలాగే ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. ఫెయిల్యూర్ గురించి ఆలోచించకూడదు. సానుకూల దృక్పథంలో ముందుకు వెళ్లాలి. దీని వలన మెదడు చురుకుగా పనిచేస్తుంది. అలాగే సరైన నిద్ర లేకపోవడం వలన జ్ఞాపకశక్తిని కోల్పోతారు.
Advertisement
Also read:
ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం మంచిది. ఒంటరిగా చదవడం కంటే గ్రూప్ స్టడీ చేయడం వలన జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. ఏదైనా చదువుతున్నప్పుడు దానిని రాసుకుంటూ ఉంటే గుర్తుంటుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రోటీన్, ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే తృణధాన్యాలు, గింజలు కూడా హెల్ప్ చేస్తాయి. మెదడు బాగా పనిచేయడానికి విజువలైజేషన్ కూడా ముఖ్యం. ఇలా మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!