Advertisement
కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యత ఇంత అంత కాదు. ప్రతి ఒక్కరు కూడా కార్తీకమాసంలో శివుడిని ఆరాధిస్తారు, కార్తీకమాసం గురించి స్కంద పురాణంలో కూడా చెప్పబడింది. కార్తీకమాసానికి సమానమైన మాసం కూడా లేదు, విష్ణుమూర్తికి సమానమైన దేవుడు కూడా లేడు. వేదాలతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం కూడా లేదట. శివకేశవులు ఇద్దరికీ కూడా ఈ నెల అంటే చాలా ఇష్టం. ఈరోజు నుంచి కార్తీక మాసం మొదలైంది. శివ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడుని పూజిస్తారు. దీప, ధూప నైవేద్యాలతో శివాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. ఉదయాన్నే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి దీపారాధన చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది.
Advertisement
Advertisement
ప్రతిరోజు కూడా సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు చేయకూడదు. కార్తీకమాసంలో శివుడికి కోపం కలిగించకూడదు. కార్తీకమాసంలో ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి.
Also read:
మాంసాహారంతో పాటుగా ఈనెల మద్యం సేవించడం కూడా మంచిది కాదు. ప్రదోషకాలంలో నిద్రపోకూడదు. ఎక్కువ సమయం శివుడిని ఆరాధించడానికి కేటాయించాలి. కొబ్బరికాయని, ఉసిరికాయని ఆదివారం నాడు కార్తీక మాసంలో తీసుకోకూడదు. ఉదయం, సాయంత్రం కూడా తులసి కోట దగ్గర దీపారాధన చేయడం మంచిది. తెలిసి తెలియక చేసిన పాపాలు దీప దానం చేయడం వలన దీపం వెలికించడం వలన పోతాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!