Advertisement
చాలామంది ఈ మధ్యకాలంలో గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె సమస్యల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరైన జీవాని విధానాన్ని ఫాలో అవ్వడం వలన గుండె సమస్యలు రావు. అలాగే ఫ్యామిలీ హిస్టరీ గురించి కూడా తెలుసుకోవాలి. గుండె సమస్యలు రాకుండా ఉండడానికి బ్యాలెన్స్డ్ డైట్ ని తీసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, కొవ్వు, పంచదార ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరిక శ్రమ పై ఫోకస్ పెట్టాలి.
Advertisement
ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే గుండె సమస్యలు రావు. టైప్ టు డయాబెటిస్, గుండె సమస్యలు, క్యాన్సర్ ఇలాంటివి రాకూడదంటే కచ్చితంగా వ్యాయామం చేయాలి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి స్మోకింగ్ మానేయాలి. స్మోకింగ్ వంటి దురాలవాట్ల వలన ఆరోగ్యం పాడవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. షుగరీ డ్రింక్స్ ని కూడా ఎక్కువ తీసుకోకూడదు.
Advertisement
Also read:
గుండె ఆరోగ్యంగా ఉండడానికి బీపీ చెక్ చేయించాలి. బీపీ అదుపులో ఉన్నట్లయితే హెల్త్ కూడా బాగుంటుంది. గుండె సమస్యలు కూడా రావు. ఎక్కువ బరువు ఉంటే అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి సరైన బరువు ఉండేలా చూసుకోండి. బరువు అదుపులో ఉండడానికి యోగ, వ్యాయామం వంటివి ఫాలో అవ్వండి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. సరిపడా నిద్ర లేకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. గుండె సమస్యలు కూడా వస్తాయి. ఒత్తిడి వలన కూడా గుండె సమస్యలు రావచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!