Advertisement
కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ నెలలో పరమేశ్వరుడిని, విష్ణువుని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. శివుడికి, విష్ణువుకి ఈ నెల అంటే ఎంతో ఇష్టం. ఈ మాసంలో కార్తీక సోమవారానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. కార్తీక సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో శివుడుని ఆరాధిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పాపాలన్నీ కూడా పోతాయి. శివ సాయిజ్యం లభిస్తుందట. అలాగే ఎవరైతే కార్తీక సోమవారం నాడు శివుడుని ఆరాధిస్తారో వాళ్లకి చెడు పనుల నుంచి విముక్తి లభిస్తుందట. అలాగే కార్తీకమాసంలో మొదటి సోమవారం నాడు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement
ఈరోజున శివారాధన చేయడం చాలా మంచిదట. కార్తీక సోమవారం నాడు శివుడు అనుగ్రహం కలగాలంటే ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి ఉపవాసం చేయాలి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు దానధర్మాలు చేయడం మంచిది. కార్తిక సోమవారం నాడు స్నానం, పూజ, జపం, ఉపవాసం అన్ని కూడా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలంతో సమానమట.
Also read:
కార్తీక సోమవారం ఉపవాసం ఉండి భక్తితో శివుడిని ఆరాధిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కష్టాల నుంచి బయటపడొచ్చు. కార్తీక సోమవారం నాడు శివుడిని పూజించి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచి జరుగుతుంది అలాగే ముత్తైదువులు భక్తులతో శివుడిని కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి