Advertisement
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి జగన్ షాక్ ఇచ్చారు. ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతలు నుంచి ఆయనను తప్పించేశారు. చింతాడ రవికుమార్ కి ఆ పదవిని ఇచ్చారు. దీంతో తమ్మినేనికి ఘోర అవమానం జరిగినట్టయింది. వైసీపీలో మార్పులు చేయడానికి జగన్ చూస్తున్నారు. అయితే ఈ సమయంలోనే ఇన్చార్జ్ లని మారుస్తున్నారు. అందులో భాగంగా తమ్మినేనిని తప్పించారు. మొన్నటి వరకు టికెట్ ఆశించారు చింతాడ కానీ తమ్మినేని సీతారామ్ కి ప్రాధాన్యం ఇస్తూ జగన్ ఆయనకి టికెట్ కేటాయించారు. తమ్మినేని ఓడిపోవడంతో పార్టీ శ్రేణులకు నిరాశ కలిగింది.
Advertisement
ఇప్పుడు తమ్మినేనిని తప్పించి ఆ బాధ్యతల్ని రవికుమార్ కి అప్పగించారు. తమ్మినేని రాజకీయ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ గా తమ్మినేని 1980లో నియమితులయ్యారు. 1983లో టీడీపీలో చేరారు. పోటీ చేసి గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలోకి వెళ్లారు. 1983 నుంచి 1999 వరకు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఐదు సార్లు వరుసగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
Advertisement
Also read:
2014లో వైసీపీ అభ్యర్థి కింద పోటీ చేసి ఓడిపోయారు. 2019లో గెలిచారు అసెంబ్లీ స్పీకర్ గా కూడా నియమితులయ్యారు మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో తమ్మినేనికి టికెట్ ఇవ్వద్దని సొంత పార్టీ శ్రేణులు హై కమాండ్ ని కోరాయి. అయినా కూడా సీనియారిటీని చూసే జగన్ టికెట్ ఇచ్చారు అయితే ఓటమి తప్పలేదు ఆయనపై గెలిచిన కూన రవికుమార్ స్వయానా మేనల్లుడు. కుటుంబ రాజకీయాలు నడుస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!