Advertisement
సింగర్ సునీత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సునీత అందరికి సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి సక్సెస్ ని అందుకున్నారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి సింగర్ గా అడుగుపెట్టారు. చాలామంది హీరోయిన్లకి డబ్బింగ్ చెప్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో అద్భుతమైన పాటల్ని ఆలపించి శ్రోతలని ఆకట్టుకున్నారు. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. వైజాగ్ రావడంతో వైజాగ్ గురించి సునీత చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Advertisement
సంగీతం నేర్చుకుంటే జ్ఞానం వస్తుందని.. స్వరం మాత్రం జన్మతః వస్తుంది అని కామెంట్ చేశారు. భక్తిగా, శ్రద్ధగా సంగీతాన్ని స్వీకరించాలని అన్నారు. మా అమ్మ వాళ్ళది విశాఖపట్నం. ఆమె చిన్నప్పటి నుంచి వైజాగ్ గురించి అద్భుతంగా చెప్పడంతో ఓహో వైజాగ్ అంటే ఇలా ఉంటుందని.. నేను ఊహించుకునే దానిని అని సునీత అన్నారు.
Advertisement
Also read:
Also read:
నాగార్జున, మహేష్ బాబు అంత యంగ్ గా ఎందుకు ఉంటారు..? కారణం ఏంటంటే..?
కైలాసగిరి, రిషికొండ మీద నుంచి నగరాన్ని చూడడం కొండ పక్కన నుంచి వెళ్లే దారి చూడడానికి కొత్తగా అనిపిస్తున్నాయని.. వైజాగ్ లో ఉండే వాళ్ళు అదృష్టవంతులు అని ఆమె చెప్పుకొచ్చారు. నాకు సముద్రాలు కొండలు ప్రకృతి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ప్రకృతి నడుమ ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి ఇష్టపడతానని ఆమె అన్నారు. ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!