Advertisement
ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చ జరుగుతోంది. రాబోయే రోజులు, తరం మొత్తం ఏఐ ఏ అని వాదనలు కూడా వినపడుతున్నాయి. టెక్నాలజీలో మార్పులు రావడంతో ప్రపంచమంతా మారిపోతుందని వార్తలు కూడా వస్తున్నాయి. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం ఎక్కువగా పెరిగింది. టెక్నాలజీ రాకతో కొన్ని ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. ఏఐ చాట్ బాట్ ని విద్యార్థులు హోంవర్క్ కోసం ఉపయోగిస్తున్నారని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Advertisement
Also read:
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక విద్యార్థిని ఏఐ ని ఎలా ఉపయోగించిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేరళ కి చెందిన ఒక విద్యార్థి ఏఐ టెక్నాలజీ తో హోంవర్క్ చేశాడు. సేమ్ తన హ్యాండ్ రైటింగ్ పోలిన విధంగా రాసే మిషన్ ని రూపొందించాడు.
ఇది అచ్చం తన హ్యాండ్ రైటింగ్ లోనే రాసేస్తుంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించాడు ఒక పేజీలో రాసిన తర్వాత ఇంకో పేజీని కూడా మిషన్ ఓపెన్ చేస్తుండడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఏఐ టెక్నాలజీతో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!