Advertisement
దాదాపు 100 పాటలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. జర్నలిస్టుగా కెరియర్ ని స్టార్ట్ చేసి గీత రచయితగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన రాసిన పాటల్ని ఇష్టంగా అందరూ వింటూ ఉంటారు. ఉషా కిరణ్ పథకం పై నిర్మించిన మూవీ తో తెరంగేట్రం చేశారు. కులశేఖర్ నువ్వు నేను, అవునన్నా కాదన్నా, జయం ఇలా పలు సినిమాలకు పాటలు రాశారు. ఆర్పి పట్నాయక్, తేజ కాంబోలో వచ్చిన మూవీస్ కి రచయితగా పని చేశారు.
Advertisement
కులశేఖర్ 1971 ఆగస్టు 15న పుట్టారు. గీత రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రేమలేఖ రాశా మూవీకి దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా ఆలస్యం అవ్వడంతో అప్పులపాలైపోయారు. అప్పటి నుంచి సినిమా అవకాశాలు తగ్గడం వలన మానసికంగా బాధపడటం.. 2013లో ఒక ఆలయంలో దొంగతనం చేసి అరెస్టు అయ్యారు.
Advertisement
Also read:
విచారణలో మానసిక స్థితి సరిగ్గా లేదని చికిత్స కోసం రాజమండ్రి కి తరలించారు. జైలు జీవితం తర్వాత ఒంటరిగానే ఉన్నారు. తెలిసినవాళ్లు రానివ్వలేదు. మానసికంగా కృంగిపోయారు. తర్వాత కూడా ఫలితాలు దొంగతనాలు చేశారని వార్తలు వచ్చాయి. వాళ్ళ వాళ్ళెవరూ కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డారు. నిన్న హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.