Advertisement
అమావాస్యకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య నాడు కొన్నిటిని ఆచరిస్తే మంచిదని అంటారు. ప్రతి నెలా కృష్ణపక్షం చతుర్థి తర్వాత రోజు అమావాస్య వస్తుంది. మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే అమావాస్య రోజుకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అమావాస్య నాడు మహావిష్ణువుని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుందట. అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకనే అమావాస్య రోజున నది స్నానం ఆచరించి సాయంత్రం పూట లక్ష్మీదేవిని ఆరాధించాలని అంటారు.
Advertisement
అమావాస్యకే ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. పూర్వికులు అనుగ్రహాన్ని పొందాలంటే అమావాస్య నాడు తర్పణాలని ఇచ్చే ఆచారం ఎప్పటి నుంచో వస్తోంది. కార్తీకమాసంలో వచ్చే అమావాస్యకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో డిసెంబర్ 1వ తేదీన అమావాస్య వస్తోంది. డిసెంబర్ 1న అమావాస్యనాడు మతపరంగా విశేషమైన ప్రయోజనాలని పొందవచ్చట.
Advertisement
Also read:
కార్తీకమాస అమావాస్య నాడు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆరోగ్యం కూడా బావుంటుందట. డిసెంబర్ ఒకటి అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. కార్తీక అమావాస్య రోజున ఉదయం నిద్ర లేచి.. నది స్నానాన్ని ఆచరించి దేవాలయానికి వెళ్ళాలి తర్వాత లక్ష్మీదేవి పూజ చేయాలి. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా అమావాస్యనాడు లక్ష్మీదేవిని ప్రత్యేకించి ఆరాధించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.