Advertisement
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ అద్దంకి దయాకర్ పైనే పడింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా.. బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు మూడు దక్కనున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఒకటి ఓసీ , బీసీ , ఎస్సీ లేదా ఎస్టీ కు ఇవ్వాలని అనుకుంటున్నారు.రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డిలు తెగ పట్టుబడుతున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్ , చరణ్ కౌశిక్ యాదవ్ ,నీలం మధు పోటీ పడుతున్నారు.
Advertisement
Advertisement
అయితే, ఈసారి అయినా అద్దంకికి అవకాశం దక్కుతుందో లేదోననే ఉత్కంఠ కనిపిస్తోంది. పార్టీ కోసం అనేక దఫాలుగా త్యాగాలకు సిద్ధపడిన నేతల్లో అద్దంకి ఒకరు. రేవంత్ కు అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయనకు గతంలోనే ఎమ్మెల్సీ వరించినట్టే వరించి, చివరి నిమిషంలో చేజారింది. ఎమ్మెల్యే కోటాలో తప్పకుండా న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు అప్పట్లోనే హామీ ఇచ్చారు.
ఇప్పుడు ఇస్తారా? లేదంటే సీనియార్టీ , ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాదిగకు అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే అద్దంకి ఈసారి కఠిన నిర్ణయమే తీసుకోనున్నారు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, ఇక నిరీక్షించనని తెగేసి చెప్పేశారు.