Advertisement
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది మురము ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ద్రౌపది ముర్ము అసలు పేరు అది కాదట. ముర్ముకు తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. మరోవైపు, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, 12 జన్ పథ్ లోని నూతన నివాసానికి మారారు.
Advertisement
read also: టాలీవుడ్ మొత్తం అడిగినా కూడా వెంకటేష్ ఆ పని చేయరట !
రాష్ట్రపతి ముర్ము జీతం ఎంత ?
Advertisement
భారత రాష్ట్రపతి నెలలకు 5 లక్షల వేతనం అందుకుంటారు. నెలవేతనమే కాకుండా ఆదనంగా అనేక సదుపాయాలు భారత ప్రభుత్వం కల్పిస్తోంది. ఉచిత నివాసం, ఉచిత వైద్యం, ఏటా ఆఫీసు ఖర్చులకోసం లక్ష రూపాయలు వినియోగించుకునే విసులుబాటు ఉంటుంది. రాష్ట్రపతి హోదాలో ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అత్యంత విలాసవంతమైన మెర్సీ డేజ్ బెంజ్ కారు,పటిష్టమైన భద్రత ఎల్లప్పుడూ కొనసాగుతుంది. కారుకు నంబర్ ప్లేట్ ఉండదు. దానికి బదులుగా జాతీయ చిహ్నం మాత్రమే ఉంటుంది. భద్రత కారణాల దృష్ట్యా కారుకు సంబంధించిన ఇతర వివరాలు ఏవి వెల్లడించారు. ఇక రాష్ట్రపతి జీవిత భాగస్వాములకు అదే తరహా గౌరవాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది.
రిటైర్మెంట్ తర్వాత కూడా రాష్ట్రపతి హోదాకు తగిన రీతిలో వారి అలవెన్స్ లను భారత ప్రభుత్వం అందిస్తోంది. జీవిత భాగస్వామికి సైతం సెక్రటేరియల్ అసిస్టెన్స్ కింద నేలకు రూ.30 వేలు వెళ్తాయి. అద్దే లేని అత్యంత విలాసవంతమైన బంగాళాను కేటాయిస్తారు. రెండు ల్యాండ్ లైన్ ఫోన్లు, ఒక మొబైల్ కూడా ప్రభుత్వం వైపు నుంచి అందజేస్తారు. రిటైర్మెంట్ తర్వాత కూడా పర్సనల్ స్టాఫ్ గా ఐదుగురిని నియమించుకునే వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఎక్కడికి పర్యటించిన తనతో పాటు మరొకరికి హై క్లాస్ ట్రైన్ లో గాని, ఎయిర్ బస్సులో గాని ప్రయాణించే వీలుంది.
READ ALSO : నెపోటిజంపై విజయ్ దేవరకొండకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండ్లన్న?