Advertisement
Sitaramam Movie Review: వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘సీతారామం‘. ఇందులో హీరోగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించారు. దుల్కర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాళి ఠాగూర్ నటించింది. టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Advertisement
Sitaramam Movie Review and Rating
#కథ మరియు వివరణ:
సినిమా 1985 ప్రాంతంలో ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ మేజర్ అయిన తారిక్ తన మనవరాలు ఆఫ్రిన్ (రష్మిక మందన) కి ఓ బాధ్యత అప్పజెప్పుతాడు. ఇండియాకు చెందిన మహాలక్ష్మి (మృణాళి ఠాగూర్) ఎక్కడుందో కనుక్కొని ఆమెకు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) 20 ఏళ్ల క్రితం రాసిన లెటర్ అందజేయాలని చెబుతాడు. మహాలక్ష్మిని వెతికే క్రమంలో ఆఫ్రిన్ అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటుంది. ఎలాంటి పరిచయం లేని లెఫ్టినెంట్ రామ్ కి, మహాలక్ష్మికి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? రామ్ మహాలక్ష్మి ఎందుకు విడిపోయారు? ఇంతకీ రామ్, మహాలక్ష్మి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ లెటర్ లో రామ్ ఏమి రాశాడు? అనేది మిగతా కథగా చెప్పొచ్చు.
Advertisement
సీతారామం రివ్యూ
సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం రొమాన్స్, సస్పెన్స్, హ్యూమర్ తో నడిపించాడు. దుల్కర్ సల్మాన్, మృణాళి ఠాగూర్ కెమిస్ట్రీ హైలెట్ అని చెప్పాలి. విజువల్స్ గురించి కూడా ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఓ క్లాసిక్ లవ్ స్టోరీ గా సీతారామం చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు. ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సస్పెన్స్ ప్రేక్షకుల మదిలో క్యారీ అయ్యేలా దర్శకుడు చేయగలిగాడు. ఇక సెకండ్ హాఫ్ సైతం హను రాఘవపూడి క్వాలిటీ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ వరకు ఆ సస్పెన్స్ క్యారీ చేయగలిగారు. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ మెప్పించింది. సాంగ్స్ తో బిజిఎం సినిమాను ఎలివేట్ చేసింది.
#ప్లస్ పాయింట్స్:
దుల్కర్ సల్మాన్, మృణాళి ఠాగూర్, రష్మిక మందన ల యాక్టింగ్
హను రాఘవపూడి క్యాస్టింగ్
సునీల్,వెన్నెల కిషోర్ కామెడీ
#మైనస్ పాయింట్స్:
స్లో పేస్
రిపీటెడ్ రొమాన్స్ సీన్లు
ఎడిటింగ్
#రేటింగ్: 2.25/5
also read : ప్లాఫ్ సినిమా కోసం వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ను వదులుకున్న రవితేజ..ఆ సినిమా ఏంటంటే..?