Advertisement
తెలుగు ఇండస్ట్రీలో నిర్మలమ్మ అంటే తెలియనివారుండరు. అమ్మ,అమ్మమ్మ లాంటి పాత్రల్లో తనదైన శైలిలో నటించి మెప్పించింది. కానీ నిర్మలమ్మ ఇండస్ట్రీలోకి హీరోయిన్ కావాలనే ఆశతో వచ్చింది. కానీ అది నెరవేరలేదు. దానికి కారణం ఏంటో ఒక సారి చూద్దాం. ఆమె ముందుగా విజయవాడ రేడియో కేంద్రం లో నుంచి ప్రసారమయ్యే వందలాది నాటకాల్లో పాల్గొన్నది. దీని తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి వచ్చింది. ఆమె గొంతు పనికిరాదని చాలామంది హేళన చేశారు. కానీ నిర్మలమ్మ హీరోయిన్ గానే పరిశ్రమకు పరిచయం కావాలి. యవ్వనంలో ఉన్న ఆమె ఫొటోలు చూస్తే ఏ హీరోయిన్ కు తగ్గని అందం ఆమెది.
Advertisement
ఆ ఫోటోలు చూసి “అంతా మనవాళ్లే” అనే సినిమాలో హీరోయిన్ వేషం ఇచ్చారు. ఈ మూవీలో వల్లం నరసింహారావు హీరో. ఆయన కూడా నూతన పరిచయమే. అప్పట్లో హీరో, హీరోయిన్ కొత్త అయితే జనం చూడారని భయంతో వల్లం నరసింహారావు ను ఉంచి నిర్మలమ్మ ను తీసేసారు. దీని తర్వాత భరణీ వారి చక్రపాణి, వాహినీ వారి బంగారు పాప సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ మరీ బక్కగా ఉన్నదని రిజెక్టు చేసారు. దీంతో హీరోయిన్ అవ్వాలనుకున్న నిర్మలమ్మ బాధపడి మద్రాసులో ఉండడం ఇష్టం లేక , మళ్లీ విజయవాడ వెళ్ళి పోయి నాటకాలు ప్రదర్శించడం మొదలు పెట్టింది. 2 ఏళ్ల తర్వాత నిర్మల భర్త కృష్ణారావుకు “వాళ్ల పెత్తనం” అనే చిత్రంలో ప్రొడక్షన్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది.
Advertisement
దీంతో వారు ఫ్యామిలీతో మద్రాసు షిఫ్ట్ అయ్యారు. నిర్మల మద్రాస్ వచ్చారని తెలిసి సారధి వారి “ఎత్తుకు పై ఎత్తు” అనే చిత్రంలో ఒక వేషం ఇచ్చారు. దీని తర్వాత “భాగ్య దేవత” మూవీ లో సావిత్రి అమ్మ గా నటించమని అడిగారు. దీంతో దానికి ఒప్పుకున్నారు నిర్మల. కానీ అదే మూవీ లో సావిత్రి నిర్మల అక్క చెల్లెలు గా కనిపించారు. దీంతో అమ్మ పాత్రలు కూడా దక్కవేమోననే భయపడ్డారు నిర్మలమ్మ. దీని తర్వాత గుళ్లో పెళ్లి, భక్త రఘునాథ్, భార్య భర్తలు, కులగోత్రాలు లాంటి చిత్రాల్లో అమ్మ పాత్రలో ఆమెకు లభించాయి. ఇక హీరోయిన్ అయ్యే అవకాశం లేదని భావించి తన వయసుకు మించిన అమ్మ,అమ్మ పాత్రలకు ఫిక్స్ అయ్యారు నిర్మలమ్మ. ఇలా హీరోయిన్ అవ్వాలనే ఆశలు వదులుకొని అమ్మ,అమ్మమ్మ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.
ALSO READ;
హీరోలని వారి నటనని డామినేట్ చేసి హైలైట్ గా నిలిచిన 10 సినిమాలు !