Advertisement
మన భారతదేశ సంప్రదాయంలో పెళ్లి అంటే ఒక అపురూపమైన ఘట్టంగా భావిస్తారు. ఈ పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు చాలా దగ్గర అయిపోతాయి. అలాంటి పెళ్లిని బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా చేసుకుంటారు. పెళ్లికి విచ్చేసిన వారంతా నిండు నూరేళ్లు పిల్లాపాపలతో జీవించాలని దీవిస్తారు. కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం చేసుకున్న కొద్ది రోజులకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకొని ఉంటున్నవారు చాలామంది ఉన్నారు. అది కామన్ వ్యక్తులు అయితే ఎవరూ పట్టించుకోరు కానీ, స్టార్డం ఉన్న వారు మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.అయితే మెగా ఫ్యామిలీకి చెందిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు..
Advertisement
అలాగే చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కూడా పెళ్లి విషయంలో తప్పటడుగు వేసింది. ముందుగా ఆమె లవ్ చేసిన శిరీష్ భరద్వాజ్ ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఒక కుమార్తె పుట్టాక ఆమె ఆయనకు విడాకులు ఇచ్చేసి కళ్యాణ్ దేవ్ ను వివాహమాడింది. కళ్యాణ్ దేవ్ తో కూడా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ తరుణంలోనే శ్రీజ కళ్యాణ్ రామ్ మళ్ళీ విడిపోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి మెగా ఫ్యామిలీలోని వీరి గురించి అందరికీ తెలిసిందే. కానీ ఎవరికీ తెలియని మరో ఇద్దరి గురించి మనం ఇప్పుడు చూద్దాం..
Advertisement
అల్లు బాబీ :
అల్లు -మెగా కుటుంబం అంటే ఒకటే అన్న విధంగా చూస్తారు అభిమానులు. ఆ కుటుంబాన్ని ఎప్పుడు వేరుగా అస్సలు చూడలేరు. నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి కూడా రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్యతో కూతురు పుట్టాక విడిపోయి ముంబైకి చెందిన మరొక డిజైనర్ ను వివాహమాడారు.
విజయ దుర్గ :
మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు, ప్రముఖ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ తల్లి విజయ దుర్గ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పుట్టాక తన భర్తతో విభేదాలు వచ్చి చాలా రోజుల నుంచి భర్తను దూరంగానే ఉంది విజయ దుర్గ. దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల పాటు వారు దూరంగా ఉన్నారు. అయితే వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పెద్దవారయ్యాక ఆమెకు ఈ వయసులో తోడు కావాలని ఒక డాక్టర్ ను రెండో వివాహం చేసుకుందట.. మెగా ఫ్యామిలీకి చెందిన దగ్గరి వారికి వివాహాలు కలిసిరాక ఇలా ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకున్నారు.
also read: