Advertisement
మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి అంశానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారమే పూర్వకాలం నుంచి మన పెద్దలు నడుచుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ పాటిస్తున్నారు. కానీ కొంతమంది మారుతున్న కాలం కొద్దీ వాటీని వదిలేస్తున్నారు. ఈ ఆచారాలలోనే ఒకటి భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, భర్త కొన్ని పనులకు దూరంగా ఉండాలని శాస్త్రాలు పేర్కొన్నాయి. భార్య గర్భం దాల్చింది అంటే చాలు భర్త చాలా సంతోషిస్తారు. హిందువుల్లో శ్రీమంతం వంటి శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఈ విధంగా పిల్లలు పుట్టే వరకు భార్య కోరిక మేరకు మాత్రమే నడుచుకోవాలని సూచించారు పెద్దలు.
Advertisement
Advertisement
ఆమెకు అప్పుడు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ వస్తువులను తెచ్చిపెట్టాలని అన్నారు. ఇలా చేయడం వల్ల ఆమె సంతోషంగా ఉంటుంది దీని వల్ల కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుందని అంటారు. ఈ క్రమంలో భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. భార్య గర్భం దాల్చినప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు.. అలాగే చెట్లను కూడా నడక కూడదట. అలా చేయడం వల్ల పుట్టే బిడ్డకు అరిష్టం కలుగుతుందని అంటారు. భార్య గర్భం దాల్చాక 6 నెలల సమయం తర్వాత భర్త కటింగ్ చేసుకోకూడదు. కనీసం సేవింగ్ కూడా చేసుకోకూడదని అంటారు.. అంతిమయాత్రలో శవాలను మోయకూడదు.
అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుందట. అలాగే భర్త విదేశీ ప్రయాణాలకు వెళ్లకూడదట. అసలు ఆమెను విడిచి దూరంగా వెళ్ళకుడదట. అలాగే తీర్థయాత్రలు, పర్వతారోహణ, పడవలు ఎక్కకూడదట. అలాగే గృహ ప్రవేశం కూడా చేయకూడదట.. ఈ విధంగా ఇలాంటి కొన్ని పనులకు దూరంగా ఉండటం వల్ల భార్య సంతోషంగా ఉండి పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు.
Also read: ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా కి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఇవే!