Advertisement
సాధారణంగా ప్రేమకథా చిత్రాల్లో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. వారి ప్రేమకథకు అందులో ఎవరో ఒకరు అడ్డు వస్తారు. ఆ అడ్డును దాటుకొని చివరికి వారు కలుస్తారా, పెళ్లి చేసుకుంటారా, చివరికి ఏం జరుగుతుంది అనే బేస్ మీద మన లవ్ స్టోరీ లన్ని సెన్సేషన్ హిట్ కొట్టాయి.. ఇందులో కొన్ని ప్రేమ కథలు క్లాస్ ప్రేమకథలు గా నిలిచాయి. ఇందులో అప్పుడు దేవదాసు నుంచి ఈ మధ్య వచ్చిన సీతారామం వరకు వచ్చిన ప్రేమ కథలు ఏంటో ఓ లుక్కేద్దాం..
Advertisement
దేవదాసు:
ఎంత డబ్బు ఉన్నా, ఏం చేసిన ప్రేమకు అడ్డు అనేది ఉండదు . ప్రేమ అనేది దక్కాలంటే హీరో కి అదృష్టం ఉండాలనీ చెప్పిన గొప్ప లవ్ స్టోరీ దేవదాస్.
మరో చరిత్ర:
ఇందులో బాలు-స్వప్నల మధ్య ప్రేమ కొత్తగా ఉంటుంది. చూస్తున్న అభిమానులని ప్రేమలో పడేస్తుంది. కానీ చివరిలో అందరిని కన్నీళ్లు పెట్టిస్తుంది.
గీతాంజలి:
రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి అనే లవ్ స్టోరీ ని తీసుకొని మణిరత్నం గారు ప్రేమకావ్యం గా తెరకెక్కించారు.. టాలీవుడ్ లో బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఈ మూవీ మొదటి వరుసలో ఉంటుందని చెప్పవచ్చు.
అభినందన
రాజా-రాణికి మధ్య లవ్ పుడుతుంది. ఇంతలో అక్క చనిపోతే బావకి పెళ్లి చేద్దాం అనుకుంటారు నాన్న…ఇది సినిమా లైన్. కానీ శోభన-కార్తీక్ లా యాక్టింగ్, ఇళయరాజా గారి సంగీతం ఈ సినిమా ని ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా మలిచారు.
తొలి ప్రేమ
టాలీవుడ్‌లో 80ల 90ల నాటి కమర్షియల్ చిత్రాల హిట్ ఫార్ములా తో వచ్చింది తొలి ప్రేమ. టాలీవుడ్ లో ఈ ప్రేమ కథ ను ఇప్పటికి గుర్తు చేసుకుంటారు.
నువ్వే కావాలి
స్రవంతి మూవీస్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా మలయాళ రీమేక్ ఐనప్పటికి కొంత చేంజ్ చేసి టాలీవుడ్ లో బెస్ట్ లవ్ స్టోరీ గా అందించారు.
Advertisement
మన్మధుడు
త్రివిక్రమ్, వై విజయ్ భాస్కర్ లు ఇద్దరూ కలిసి తీసిన మరో మూవీ మన్మధుడు. ఇందులో నాగార్జున అమ్మాయిలను హేట్ చేస్తూనే చివరికి రొమాంటిక్ లవ్ లో పడతాడు.
8. 7/జీబి బృందావన్ కాలనీ
సెల్వరాఘవన్ తీసిన మూవీస్ లో ఇది ఒకటీ.. లవ్ కి కొత్త యాంగిల్ చూపించారు.
ఏం మాయ చేసావే:
ప్రేమకి ఏజ్ తో పని లేదు, ప్రేమకి మతం అడ్డు కాదు, ప్రేమ సముద్రాలు దాటుతుంది అనే యూనివర్సల్ లవ్ ఫార్ములా ని పర్ఫెక్ట్ గా చూపించిన సినిమా.
ఆర్య
లవ్ లోనే వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్టుతో చాలా క్లియర్ గా చూపించిన సినిమా ఆర్య
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
ప్రేమకి కులం-మతం అడ్డు కాదు అంటునే…అవి అడ్డు పడితే ఎలా ఉంటుందో చెప్పిన గొప్ప చిత్రం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.
అర్జున్ రెడ్డి
లవ్ కి ఒక కొత్త డైమెన్షన్ లో చూపించిన సినిమా.లవ్ కి కొత్త అర్దం చెప్పిన ఈ సినిమా
ఫిదా
రాణి కోసం రాజకుమారుడే దిగి వస్తే ఎలా ఉంటుందో అలా శేఖర్ కమ్ముల ఒక కమ్మనైనా ప్రేమ కథ ను ఫిదా సినిమా ద్వారా అందించారు.
సీతారామం
మరోచరిత్ర, గీతాంజలి లాంటి ప్రేమ కథల తర్వాత మన తెలుగు వాళ్లకి అలాంటి క్లాసిక్ ని ఇచ్చింది హను రాఘవపూడి. రామ సీత అనే పాత్రలతో హిస్టోరికల్ చాలా బాగా చూపించారు.
ALSO READ:
1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?