Advertisement
చనిపోయిన వారి ప్రేమానురాగాలకు గుర్తుగా వారి ఫోటోలను ఇంటిలో పెట్టుకొని వారికి ఆత్మ శాంతి చేకూరాలని, రోజు దీపం వెలిగించడం చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో మరణించిన వారి ఫోటోలను ఏ దిక్కున పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందో చెబుతుంది. ఇంటిలో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకోరాదు. చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకుంటే ఇంటిలో నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది.
Advertisement
ఇవి కూడా చదవండి: టెన్త్ మేమో పోయిందా…? ఇలా పొందండి సింపుల్ గా!
దీంతో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్ళతో సమానంగా పూజ చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే దేవతల ఆగ్రహానికి కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు, ఆందోళన ఏర్పడి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంటుంది.
Advertisement
ఇవి కూడా చదవండి: దేవదాసు నుండి సీతారామం వరకు 15 ఆల్ టైం ప్రేమ కథలు.. ఏంటంటే..?
అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను పడకగదిలో ఉంచరాదు. బ్రతికున్న వారి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలను ఉంచరాదు. ఇలా చేస్తే బ్రతికున్న వారి ఆయుష్షు తగ్గుతుంది. ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ఏర్పడి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. మరి ఏ దిక్కున ఇంటిలో చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఉంచడం మంచిదో, అలా ఫోటోలను పెడితే ఎలాంటి శుభ ఫలితాలు దక్కుతాయో వాస్తు శాస్త్రం ఒక స్పష్టత అనేది ఇచ్చింది. వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన పితృదేవతల ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా, దక్షిణం గోడకు వేలాడదీస్తే మంచిదని చెబుతోంది. దక్షిణం గోడకు ఫోటోలను వేలాడదీస్తే వారు ఉత్తరం వైపుకు చూస్తుంటారు.
Read Also : జాతీయ జెండాను అవమానించిన రోహిత్..అంటూ నెటిజన్లు ఆగ్రహం..మీరు ఇంత ఫేకా ?