Advertisement
Rashi Phalalu in Telugu ఈ రోజు రాశి ఫలాలు 23.08.2022: రాశి ఫలాలు.. మానవ జీవితంలో భాగం అయిపోయాయి. ప్రస్తుతం కాలంలో.. ఈ రాశిఫలాలకు డిమాండ్ భారీగానే పెరిగిపోయింది. గతంలో వీటిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మేటు వంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అయితే.. ఇవాళ మంగళ వారం రోజు. ఇవాళ్టి రోజున ఏఏ రాశుల వారికి… ఏం జరుగుతుందో వారి రాశుల ప్రకారం చూద్దాం.
Advertisement
మేషం:
ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
వృషభం:
విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిధునం:
కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
కర్కాటకం:
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మనిషి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
సింహం:
మనో ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
కన్య :- వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. బదిలీపై వచ్చిన ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో సఫలీకృతులవుతారు. స్త్రీలకు అయిన వారి ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. వాహనం నిదానంగా నడపటం మంచిది.
Advertisement
తుల :- విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కళ, క్రీడ, సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహకరం. కుటుంబీకుల కోసం బాగా శ్రమిస్తారు. ధనమూలకంగా సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ఇబ్బందులెదుర్కుంటారు.
వృశ్చికం :- ఉద్యోగస్తులు, అధికారులు ధనప్రలోభానికి దూరంగా ఉండటం మంచిది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కార ఉంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. సంతకాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత వహించండి.
ధనస్సు : – మీ అభిప్రాయాలు, పథకాలు గోప్యంగా ఉంచండి. కొన్ని విషయాల్లో మీ ఊహలు, అంచనాలు నిజమవుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. చక్కని ఆలోచనలు, మంచి ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు.
మకరం :- దైవ, సేవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు, నూతన పెట్టుబడుల విషయంలో ఏకాగ్రత ముఖ్యం. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.
కుంభం :- బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త. గత సంఘటనలుపదేపదే జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందిస్తారు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించటం మంచిది. దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు.
మీనం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు ?