Advertisement
తెలంగాణ బిజెపి నాయకులు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతా పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహార శైలి పార్టీ నిబంధనలకు చాలా వరకు విరుద్ధంగా ఉందనే కారణంతోనే సస్పెండ్ చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ హై కమాండ్ ప్రకటన చేసింది. ఈ మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2 లోపు సమాధానం చెప్పాలని కూడా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియో కారణంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ.. శాసన సభాపక్ష నేత పదవి నుంచి కూడా రాజాసింగ్ ను తొలగించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు వేటు వేస్తున్నట్లు చెప్పింది. ఇది ఇలా ఉండగా ఇవాళ ఉదయం మహమ్మద్ ప్రవక్త కు వ్యతిరేకంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Advertisement
అక్కడితో ఆగకుండా దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఎంఐఎం పార్టీ కార్యకర్తలు అలాగే నేతలు సీరియస్ అయ్యారు. రాజాసింగ్ పై అన్ని చోట్ల కేసు పెట్టారు. దీంతో ఆ కేసులను స్వీకరించిన పోలీసులు, రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ ను గోషామహల్ పోలీసులు అరెస్టు చేసి, నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ వ్యవహారం నేపథ్యంలోనే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది బిజెపి అధిష్టానం. ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన కేసులు
IPC సెక్షన్ 153(a) మతాలమద్య, కులాల మద్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టడం
295(a )మత విశ్వాసాలను కించపరచటం
505(1) (2)ప్రకటనద్వారా నష్టం కలిగించడం
ఐపిసి సెక్షన్ 506 బెదిరింపులకు పాల్పడటం
READ ALSO : ఎస్.డి కార్డ్ మీద ఉండే U1, U3, HC సింబల్స్ యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా?