Advertisement
“ఇంటింటికి మట్టి పోయ్యి” అనే సామెత ఊరికే రాలేదు. పేదవాడి నుంచి ధనవంతుడి వరకు ఎంత డబ్బు ఉన్నా కానీ కుటుంబ పరంగా సమస్యలు అనేవి తప్పకుండా వస్తూనే వుంటాయి.. అది ఎవరైనా కానివ్వండి, ఏమైనా కానివ్వండి.. ఆ సమస్యల్లో కొన్ని లోలోపల పరిష్కారం అయితే మరికొన్ని బయటకు వస్తాయి.
Advertisement
అలా బయటకు వచ్చిన కొన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుల వరకు వెళ్లి కుటుంబ గౌరవాన్ని బయటపడేలా చేసుకుంటాయి.. అలాంటి వాటిలో సామాన్యుడు అయితే ఎవరికి తెలియదు కానీ సెలబ్రిటీల విషయాలు బయటకు వస్తే పుంఖానుపుంఖాలుగా లేనిపోని వార్తలు వాటికి జోడించి వచ్చిన వార్తను మూడు పువ్వులు ఆరు కాయలుగా వైరల్ అవుతుంది.. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ స్టార్ సెలబ్రిటీస్ ఆస్తుల విషయంలో వారి సొంత కుటుంబ సభ్యులనే కోర్టు వరకు తీసుకొచ్చారు.. మరి వారెవరో మనం ఇప్పుడు చూద్దాం..
ALSO READ:హీరోయిన్స్ గా మాత్రమే కాదు..! లేడీ విల్లన్స్ గా కూడా తమ నటనతో అడ్డరగొట్టిన స్టార్ హీరోయిన్స్ వీరేనా ?
ఖుష్బూ : ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన ఖుష్బూ వారి కన్న తల్లిదండ్రుల పైనే కేసు పెట్టింది.. చివరికి నాకసలు తండ్రి అనేవాడే లేడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఖుష్బూ..
Advertisement
వనిత విజయ్ కుమార్ : ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రుల పైన కేసులు పెట్టిన హీరోయిన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వనిత విజయ్ కుమార్.. ఈమె తల్లి చనిపోగానే తండ్రి విజయ్ కుమార్ ఆస్తిలో ఈమెకు చిల్లిగవ్వ కూడా ఇవ్వ అని చెప్పడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కోర్టులో కేసు వేసిన విషయం అందరికి తెలిసిందే..
సంగీత : అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంగీత. ఇటీవల చిరంజీవి నటించిన ఆచార్య మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించింది. సంగీత డబ్బులు సంపాదించడం కోసమే తల్లిదండ్రులు సినిమా హీరోయిన్ గా మార్చి తన జీవితాన్ని నాశనం చేశారంటూ చాలాసార్లు చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వారి తల్లిదండ్రుల పై కేసు కూడా వేసింది.
ALSO READ:అందంతోనే కాదు, నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?