Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు. ఆయన చనిపోయి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉంటారు. టీవీ లో ఉదయ్ కిరణ్ సినిమా వచ్చింది అంటే ఇప్పటికి అభిమానులు ఎగబడి చూస్తారు..
Advertisement
ALSO READ:సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..!
Advertisement
ఆయన వార్తలు సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ భార్య విషిత గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత విషిత అమెరికా వెళ్లిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉదయ్ కిరణ్ ఒక పార్టీలో పరిచయమైన అమ్మాయి ని పెళ్లి చేసుకున్నారు. సినీ అవకాశాలు లేకపోయినా సరే వారిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. అయితే ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్ కి వెళ్ళాడు. అతన్ని మామూలు మనిషిని చేయడానికి ఆమె ఎంతో ప్రయత్నం చేసింది.
అయినా ఉదయ్ కిరణ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆయన మరణం తర్వాత ఆమె ఏం చేస్తుంది అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఆమె ఉదయ్ కిరణ్ మరణం సమయంలో ఫేస్ బుక్ లో జాబ్ చేస్తోంది. ప్రస్తుతం విషిత ఎక్కడ జాబ్ చేస్తుందో ఎవరికీ తెలియదు కానీ, ఆమె జీతం మాత్రం లక్షల్లో ఉంది అని చెప్పవచ్చు. కానీ ఆమె ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది.
ALSO READ:పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటికి.. భార్య ఎందుకు వెళ్తుంది?