Advertisement
సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఏదైనా విజ్ఞాలు ఉన్న తొలగిస్తాడని భావిస్తారు. అందుకే ఏ పూజ చేసినా ఏ పని చేసిన ముందు పూజించేది విగ్నేశ్వరున్నె.. కాబట్టి బిజినెస్ డబ్బు విషయంలో మాత్రం తప్పకుండా ఈ విగ్నేశ్వరుని పాఠాలు నేర్చుకోవాలి.. విగ్నేశ్వరుని నుంచి పాఠాలు ఏంటి అని అనుకుంటున్నారు కదూ.. అవునండి మీరు విన్నది కరెక్టే.. విగ్నేశ్వరుని ద్వారా మనం డబ్బు పాఠాలు నేర్చుకుందాం.. ఏంటో ఇప్పుడు చూద్దాం..
వినాయకుడితో ప్రారంభిస్తే విజయం మీదే:
ఏదైనా కొత్త పని చేయాలంటే మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం.. మనం ఏది చేయాలన్నా అందులో మనం వేసే మొదటి అడుగు చాలా కీలకం. డబ్బు విషయానికి వస్తే మనం పెట్టే తొలి పెట్టుబడి, తొలి అడుగు లాంటిది.. కాబట్టి మీరు చేసే పనిని వినాయక చవితి రోజు ప్రారంభిస్తే మరీ మంచిది.
Advertisement
also read:ప్రాణ స్నేహితులైన ఎన్టీఆర్-దాసరి శత్రువులు కావడానికి కారణం ఏంటో తెలుసా?
తెలివిగా పెట్టుబడి పెట్టండి :
వినాయకుడిని గజాననుడు అని కూడా పిలుస్తుంటారు.. ఎందుకంటే ఏనుగు తలను ధరించి ఉంటారు.. ఏనుగు తల అనేది తెలివితేటలకు చిహ్నం.. కాబట్టి ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు మనం తెలివితేటలతో ముందుకు వెళ్లాలి. మనం దేనికి అయితే పెట్టుబడి పెట్టాలి అనుకుంటామో అందులో జ్ఞానం పెంచుకొని మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది గమనించి ముందుకు వెళ్లాలి.
Advertisement
ఏదైనా శ్రద్ధగా వినాలి :
లంబోదరునికి పెద్ద చెవులు ఉంటాయి. అందుకే లంబ కర్ణుడు అని పిలుస్తారు. గణేశుడు ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటారని నమ్ముతారు. అలాగే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలను, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి.
అన్ని వివరాలు స్పష్టంగా చూడాలి :
అలాగే గణపతి కళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయని నమ్ముతారు. అందుకే గణపతిని విగ్నేశ్వరుడు అని పిలుస్తారు. ఏకాగ్రత సామర్థ్యానికి చిహ్నం. బిజినెస్ పెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో ఇన్వెస్ట్ కు సంబంధించిన విషయాలను చూడాలి.
అనవసర ఇన్వెస్ట్మెంట్ ను వదలండి.
వినాయకుడికి ఒక దంతం విరిగిపోయే ఉంటుంది. అందుకే ఆయనను ఏకదంతాయ అని అంటారు. కాబట్టి బిజినెస్ విషయాలలో ఆచితూచి అడుగు వేయాలి. నష్టాలు వస్తాయి అనుకుంటే దాన్ని వదిలేయాలి.
అడ్డంకులను తొలగించుకోవాలి
గణనాధుని విజ్ఞాలను తొలగించే దేవుడు అని పిలుస్తారు. మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఈ విజ్ఞాన తొలగించుకోవాలి. దీని వల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆనందంగా పెట్టిన పెట్టుబడి మళ్ళీ లాబాల్లోకి వెళుతుంది.