Advertisement
అక్కినేని నాగచైతన్య విడాకుల తర్వాత నాగచైతన్య గురించి చాలామంది నేటిజెన్లు సెర్చ్ చేస్తున్నారు. నాగచైతన్య, సమంత ను కాకుండా ఎవరినీ పెళ్లి చేసుకునేవాడు అని ప్రశ్న చాలామంది సినీ అభిమానులలో మొదలు అవుతున్న ప్రశ్న. అయితే నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమించే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య ప్రేమ విషయం ఇంట్లో తెలియక ముందు, వారి కుటుంబం ఎవరితోనైనా సంబంధం కలుపుకోవడానికి తయారు అయ్యిందా, అనే ప్రశ్న కూడా చాలామందిలో వస్తుంది.
Advertisement
ఇవి కూడా చదవండి: పవర్ స్టార్ రీమేక్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే..!!
Advertisement
అయితే కొన్ని ప్రశ్నలకు వివిధ సందర్భాలలో అక్కినేని నాగార్జున గారే సమాధానం చెప్పారు. అయితే ఇప్పుడు మరొక సమాధానం చూద్దాం. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్ననాటి నుంచే రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహం బాలయ్య, నాగార్జున ల మధ్య కూడా సాగింది. వీరి మధ్య స్నేహం ఎలా ఉండేది అంటే, ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, రెండు కుటుంబాలు తప్పక హాజరు అయ్యేవి. అయితే వీరి స్నేహాన్ని బంధుత్వం గా మలుచుకోవడానికి కూడా బాలయ్య, నాగార్జున రెడీ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
బాలయ్య చిన్న కూతురిని నాగచైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని అప్పట్లో రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తుంది. అయితే అప్పుడు నాగచైతన్య, సమంత లవ్ మ్యాటర్ చెప్పడంతో ఈ వివాహ నిర్ణయం వెనక్కి వచ్చిందని తెలుస్తుంది. నాగచైతన్య, సమంతను లవ్ చేయకుంటే ప్రస్తుతం నందమూరి బాలయ్య కు అల్లుడుగా ఉండేవాడని పలువురు అంటున్నారు.
ఇవి కూడా చదవండి : Ranga Ranga Vaibhavanga Review: `రంగరంగ వైభవంగా` రివ్యూ