Advertisement
టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్ మరియు థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం.
Advertisement
అయితే IMDB ( ఇంటర్నెట్ డేటా బేస్) కి సంబంధించిన వారు ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ప్రతి సినిమాతో వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల స్పందనను బట్టి రేటింగ్ ఇస్తుంటారు. 2022లో ఇప్పటివరకు మన దేశంలో విడుదలైన వివిధ భాషలకు సంబంధించిన చిత్రాల్లో దక్షిణాది నుంచి ఆర్ఆర్ఆర్, విక్రమ్, కే జి ఎఫ్-2 సినిమాలు టాప్-10 లో ఉన్నాయి. ఇక IMDB జాబితాలో రేటింగ్ తక్కువ ఉన్న సినిమాలు ఎంటో ఇప్పుడు మనం చూద్దాం.
#1 లైగర్:
ఈ సినిమాకి వచ్చిన రేటింగ్ 1.6/10. ఇక ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.
#2 రగిలే గుండెలు:
ఈ చిత్రానికి వచ్చిన రేటింగ్ 1.7/10.ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించిగా చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
#3 పరమవీరచక్ర:
ఇక ఈ చిత్రానికి 1.8/10 రేటింగ్ రాగా, ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించిగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు.
Advertisement
#4 ఒక్క మగాడు:
ఈ చిత్రానికి 1.9/10 రేటింగ్ వచ్చింది.
#5 మహారథి:
ఈ చిత్రానికి 2.0/10 రేటింగ్ రాగా, ఈ సినిమాలో సైతం బాలకృష్ణ హీరోగా నటించాడు. ఇక వాసు దర్శకత్వం వహించాడు.
#6 విజయేంద్ర వర్మ:
బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన 2.0/10 రేటింగ్ రాగా, స్వర్ణ సుబ్బారావు దర్శకుడు.
#7 క్లైమాక్స్:
రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమాలో మియా మాల్కోవా నటించగా ఈ చిత్రానికి 2.1/10 రేటింగ్ సొంతం చేసుకుంది.
#8 వీరభద్ర:
బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి రవికుమార్ చౌదరి దర్శకుడిగా పని చేయగా 2.2/10 రేటింగ్ దక్కింది.
#9. మస్త్శివ :
బాలాజీ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు 2.2/10 రేటింగ్ వచ్చింది.
#10 శీను గాడు చిరంజీవి ఫ్యాన్:
దర్శకుడు రాధాకృష్ణ తీసిన ఈ సినిమాలో బ్రహ్మానందం హీరోగా నటించాడు. ఈ సినిమాకు 2.2/10 రేటింగ్ వచ్చింది.