Advertisement
హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ పేరు సంపాదించుకున్నది సీతారామం సినిమాతోనే. ఈ సినిమా ద్వారా తెలుగు అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఎంతోమంది తెలుగు స్టార్ హీరోలు ఉన్నా కానీ దర్శక నిర్మాతలు మాత్రం పట్టుబట్టి దుల్కర్ సల్మాన్ ని ఎందుకు తీసుకున్నారో సినిమా చూసిన వారికి అర్థమవుతుంది.. ఒక మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరో అయి ఉండి తెలుగు హీరోల సినిమాలో ఆయన పాత్రలో ఒదిగిపోయారని చెప్పవచ్చు.
Advertisement
also read:భలే పిల్లి… మొత్తానికి నీటిలోని చేపను పట్టేశావుగా.. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..?
Advertisement
ఇక దుల్కర్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మలయాళంలో స్టార్ హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న మమ్ముట్టీ కొడుకు. దుల్కర్ కేరళలో 1986 జూలై 28 వ తేదీన జన్మించారు. తన తండ్రి కూడా సినీ ఫీల్డ్ లో ఉండటంతో చిన్నప్పటినుంచి దుల్కర్ సినిమా వాతావరణంలోనే పెరిగారు. అందుకోసమే పెద్దయ్యాక హీరో అవ్వడానికి ముందుగానే దుల్కర్ 2011 డిసెంబర్ 22న చెన్నైకి చెందినటువంటి ప్రముఖ ఆర్కిటెక్ అమల్ సూపియా చూసి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది.
దుల్కర్ 2012 లో మలయాళ ఇండస్ట్రీలో నటన లోకి ఎంట్రీ ఇచ్చారు. రెండవ సినిమాతోనే జాతీయ స్థాయిలో ఎంతో పేరుతెచ్చుకున్నారు. దుల్కర్ రెండవ సినిమా ఉస్తాద్ హోటల్ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. అలాగే ఓకే బంగారం,కనులు కనులనుదోచాయంటే, మహానటి వంటి చిత్రాలతో తెలుగులో కూడా హీరో అయిపోయారు. ఇక మహానటి మూవీ సౌత్ ఇండియాతో పాటుగా నార్త్ లో కూడా తిరుగులేని అభిమానులను ఉన్నారు.
also read:కాకి ఈ విధంగా అరిస్తే మీరు తప్పకుండా ధనవంతులవుతారు.. ఎలాగో చూడండి..?