Advertisement
బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. రెబల్ స్టార్ వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ప్రభాస్ కు ఇప్పుడు తెలుగులోనే కాదు. సౌత్ ఇండియా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోలకు సాధ్యం కాదని ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు కేవలం డార్లింగ్ సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యాయి. బాహుబలి తో బాలీవుడ్ లోనూ భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
Advertisement
ఇవి కూడా చదవండి: చిరంజీవి రెండేళ్లు ఉతక్కుండా ఓకే షార్ట్ వేసుకున్నారా..అంతటి కష్టం వెనుక అసలు కారణం ఇదేనా..?
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘చక్రం’ మూవీని ప్రభాస్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని కృష్ణవంశీ పంచుకున్నారు. “ప్రభాస్ తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రెండు రకాల కథలు చెప్పా. అందులో ఒకటి ‘చక్రం’.మరొక మూవీ ‘రాయలసీమ’ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఫ్యాక్షన్ కాకుండా గుప్త నిధులు అనే కాన్సెప్ట్ గురించి వివరించాను. రాయలసీమ జిల్లాలోని చాలా ఊళ్ళలో గుప్త నిధుల కోసం ఇప్పటికీ వెతుకుతూ ఉంటారు.
Advertisement
ఇవి కూడా చదవండి: దేవి శ్రీ ప్రసాద్ ఆ హీరోయిన్ మధ్య లవ్.. పెళ్లెప్పుడంటే..?
ఆ నిధుల కోసం కొన్ని తరాలు అలా వెతుకుతూనే ఉంటాయి. ఆ నేపథ్యంలో సినిమా చేద్దామన్న. విశాలమైన మట్టి ప్రాంతాలు, దుమ్ము లేపే వెహికిల్స్, గుర్రాలపై చేజింగ్సు, ఫైట్స్ తో ఒక యాక్షన్ ప్యాకుడు మూవీ అవుతుందని చెప్పా. కానీ, ప్రభాస్ ‘చక్రం’ ఎంచుకున్నాడు. అప్పటికి నేను వద్దని చెప్పా. ‘ప్రభాస్ నువ్వు ఇప్పుడు యాక్షన్ జోన్ లో ఉన్నావు. ఈ సినిమా చేస్తే బాగుంటుంది’ అని అన్నాను. పైగా అప్పుడు ‘వర్షం’ కూడా విడుదలైంది. ‘సార్ నా దగ్గరకు అన్ని ఇలాంటి కథలే వస్తున్నాయి. మంచి నటన ప్రాధాన్యం ఉన్న చిత్రంలో చేయడానికి నేను మీ దగ్గరకు వచ్చా. మీరు ఏమి అనుకోవద్దు. చక్రం చేద్దాం” అని ప్రభాస్ దాన్ని ఎంచుకున్నాడని అన్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్న ఎంతో మందికి జీవిత పాటలను నేర్పే అంశాలు అందులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: గణేశున్ని 10 రోజుల పూజల తర్వాత నిమజ్జనం చేయడం వెనుక ఇంత కథ ఉందా..?