Advertisement
ప్రేమ.. రెండు మనసుల్లో ఎప్పుడు, ఏ విధంగా, ఎలా పుడుతుందో కూడా తెలియదు.. ప్రస్తుత కాలంలో మరీ ఆన్లైన్లో కూడా ప్రేమించుకుంటున్నారు.. ఇలా వీళ్లిద్దరు కూడా ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు. రెండేళ్లపాటు ఈ వ్యవహారాన్ని నడిపి చివరికి పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నారు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో ఒకరు పుట్టాక అత్తింటివారు వేధింపులతో అమ్మాయిని సెపరేట్ గ్లాసు మరియు ప్లేటుతో ఒక ప్రత్యేక గదిలో ఉంచారు..
Advertisement
దీనికిఅసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..కల్లాకుర్చీ జిల్లాలోని శంకరాపురం యూనియన్ విరాయురు గ్రామానికి చెందినటువంటి అంతోని రాజ్ కూతురు అన్నభరసి (25) ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. తర్వాత ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా చేస్తోంది. వీరికి 2018లో ఫేస్బుక్ ద్వారా తిరువల్లూరు జిల్లాలోని తిరువాలంగాడు యూనియన్ చిన్న కళా కాటూరు గ్రామానికి చెందినటువంటి జయరామను కొడుకు లక్ష్మణను పరిచయం అయ్యాడు.
also read:గ్రాండ్గా మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ పెళ్లి.. ఫొటోలు వైరల్
Advertisement
ఇలా వీరిద్దరి ప్రేమ పుట్టి రెండు సంవత్సరాలు ప్రేమ విహారం చేశారు. తర్వాత మార్చి 13 2020 న తిరువలంగాడు లోని ఒక కళ్యాణమండపంలో వివాహం కూడా జరిపించారు. వీరి వివాహం తర్వాత కూతురు కూడా పుట్టింది. వివాహ సమయంలో లక్షా 50 వేల రూపాయల వరకు నగదు, 10 సవర్ల బంగారం కట్నం కింద ఇచ్చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజులు వీరి కాపురం సాఫీగానే ఉంది. కానీ సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత వీరి కుటుంబంలో చిచ్చు రేగింది. అమ్మాయి దళిత కులానికి చెందిన యువతి అవడంతో అమ్మాయిని వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో ఆమె ప్రత్యేక గ్లాసు మరియు ప్లేటో ప్రత్యేక గదిలో ఉంచేవారు. ఈ విధంగా కులం పేరుతో దూషించారు. ఇది తట్టుకోలేక బాధితురాలు 6 నెలల క్రితం తిరుత్తని మహిళా పోలీస్ స్టేషన్ లో సంప్రదించి నాకు న్యాయం చేయాలని ఫిర్యాదు కూడా ఇచ్చింది.
దీంతో పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా జీవించాలని తెలియజేశారు. ఈ క్రమంలోనే మళ్లీ లక్ష్మణ్ కుటుంబ సభ్యులు యువతిపై దాడికి దిగారు. దీంతో యువతి మంగళవారం ఎస్పీని ఆశ్రయించి తనకు తగిన న్యాయం చేయాలని వేడుకుంది. తనను మరియు కూతురిని కులం పేరుతో దూషిస్తున్నారని తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారని తన భర్త లక్ష్మణ్ మరియు అత్త దేవకితో పాటు ఐదుగురిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తనపై వారు దాడి చేసిన వీడియోని కూడా ఎస్పీకి అందించింది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే విచారణ చేపట్టి యువతికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
also read: దేవి శ్రీ ప్రసాద్ ఆ హీరోయిన్ మధ్య లవ్.. పెళ్లెప్పుడంటే..?