Advertisement
ఆసియా కప్ టోర్నీ ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా సూపర్ 4 లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ఘనవిజయంతో టోర్నీ ముగించిన సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రెండు హైలెట్ విషయాలు ఏంటంటే, మూడేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. రెండోది భువనేశ్వర్ కుమార్ తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ కనబరిచాడు. తోలుత కోహ్లీ 122 పరుగులు, కేఎల్ రాహుల్ 62 పరుగులు రాణించడంతో భారత్ 212 పరుగులు చేసింది.
Advertisement
తర్వాత 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్గాన్ ను భువనేశ్వర్ కుమార్ ముచ్చమటలు పట్టించాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 1 మెయిడిన్ సహా 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో గెలుపోటములను పక్కన పెడితే కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మునుపటి టచ్ కనిపిస్తూ చెలరేగిపోయాడు. 1019 రోజుల నిరీక్షణకు తెరదించుతూ సెంచరీ తో కదం తొక్కాడు. కోహ్లీ బ్యాట్ నుంచి 70 సెంచరీలు అలవోకగా రాగా, ఈ సెంచరీ మాత్రం అంతులేని స్ట్రగుల్ నుంచి వచ్చింది. ఈ మ్యాచ్ లో సెంచరీ ద్వారా, పలు రికార్డులు సృష్టించాడు కోహ్లీ.
ఈ ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ రికార్డులు, మైలురాళ్లు
Advertisement
#1. అంతర్జాతీయ కెరీర్ లో ఇది కోహ్లీ 71 వ సెంచరీ
#2. ఇంటర్నేషనల్ టి20 లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ
#3. సచిన్ (100) తర్వాత అంతర్జాతీయ కెరీర్లు అత్యధిక సెంచరీలు (71) కోహ్లీవే
#4. అంతర్జాతీయ కెరీర్ లో 24,000 పరుగుల మైలురాయికి చేరుకున్నాడు
#5. ఇండియా తరఫున టీ 20 లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (122 నాట్అవుట్)
#6. ఇంటర్నేషనల్ టి20 లో 100 సిక్సులు పూర్తి
#7.అంతర్జాతీయ కెరీర్ లో 250 సిక్స్ లు పూర్తి
#8.ఇంటర్నేషనల్ టి20లో 3,500 పరుగుల మైలురాయి
#9.ఇంటర్నేషనల్ టి20 లో అత్యధిక హాఫ్ సెంచరీలు(33)
#10.ఆసియా కప్ 2022లో అత్యధిక పరుగులు(276)
#భువీ రికార్డుల మోత
ఇక ఈ మ్యాచ్ లో 4 ఓవర్ల స్పెల్ ను కంటిన్యూగా వేసిన భూవీ ఏకంగా 20 డాట్ బాల్స్ వేశాడు. 5 వికెట్లు సాధించాడు. నిజానికి ఇది ఒక డ్రీమ్ స్పెల్. భూవీనే కాదు, మరే బౌలర్ అయినా సరే కలలో కూడా ఊహించని స్పేల్ ఇది. 4 ఓవర్లు వేసి భూవీ కేవలం 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కాగా టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్ (83 వికెట్లు) రికార్డును భూవీ బద్దలు కొట్టాడు. 84 వికెట్లతో టి20 లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
READ ALSO : Oke Oka Jeevitham : ‘ఒకే ఒక జీవితం’ రివ్యూ