Advertisement
ప్రపంచ దేశాల్లో చాలా దేశాల ప్రజలు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతారు.. అలాగే క్రికెటర్స్ ని ఎక్కడికి వెళ్లిన గుర్తుపడతారు. అంతటి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్న చాలా మంది క్రికెటర్లు ఉన్నారు.. ఈ క్రికెటర్లు ఏ దేశంలో పుట్టిన వారైతే ఆ దేశం తరఫున ఆడతారు.. కానీ కొంతమంది క్రికెటర్లు ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్నారు.. వారెవరో ఒకసారి చూద్దాం..
క్రిస్ జోర్డాన్:
Advertisement
వెస్టిండీస్ లో పుట్టిన ఈ క్రికెటర్ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన 1988 అక్టోబర్ 4న క్రైస్ట్ చర్చ్ బార్బడోస్ లో జన్మించాడు.
ALSO READ: టాలీవుడ్ టాప్ 30 డైరెక్టర్స్ వారి భార్యలను మీరు చూశారా.. చూస్తే చూడ ముచ్చటైన జంట అనాల్సిందే..!!
సికిందర్ రాజా:
ఈయన పాకిస్తాన్ లో పుట్టి జింబాబ్వే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 1986 ఏప్రిల్ 24న సియాల్కోట్ పాకిస్తాన్ లో జన్మించాడు.
ఉస్మాన్ ఖావజా :
పాకిస్తాన్ లో జన్మించిన ఈ క్రికెటర్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో జన్మించాడు.
జాసన్ రాయ్ :
దక్షిణాఫ్రికాలో జన్మించిన ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతను డర్బన్ అనే ప్రాంతంలో జన్మించాడు.
Advertisement
ఆండ్రూ సైమండ్స్ :
ఈ క్రికెటర్ యూకేలో జన్మించి ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతను ఇంగ్లాండులోని బర్మింగ్హామ్ లో జన్మించాడు.
ఇమ్రాన్ తాహిర్ :
పాకిస్తాన్ లో పుట్టిన ఈ క్రికెటర్ ఇంగ్లాండు కౌంటీలు ఆడి, తర్వాత దక్షిణాఫ్రికాకు ఆడారు. ఇతను పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించాడు.
బెన్ స్ట్రోక్ :
న్యూజిలాండ్ లో పుట్టిన ఇతను ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతను క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో జన్మించాడు.
జాఫ్రా ఆర్చర్ :
వెస్టిండీస్ లో పుట్టిన ఇతను ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతడు బ్రిడ్జిటౌన్ బార్బడోస్ లో జన్మించాడు.
ఇయాన్ మోర్గాన్:
ఇతడు ఐర్లాండ్ లో పుట్టి ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు.
కెవిన్ పీటర్సన్:
ఈ క్రికెటర్ దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పీటర్ మారిడ్జ్ బర్గ్ లో జన్మించాడు.
ALSO READ: అత్యధిక ప్రాఫిట్ అందించిన టాప్ మీడియం బడ్జెట్ మూవీస్ ఇవే