Advertisement
మనదేశంలో సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్ళు ఇక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడ రావడం అనేది ఎప్పటినుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు. తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. అయితే స్టార్ హీరోలు స్థాపించిన రాజకీయ పార్టీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఎన్టీఆర్
దశాబ్దాల పాటు సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్, తర్వాత టిడిపి పార్టీ పెట్టి సీఎం అయ్యారు. ఏడేళ్ల పాటు సీఎం గా కొనసాగారు.
ఎంజీ రామచంద్రన్
తమిళనాట ఆయన్ను అన్నగారిగా కీర్తిస్తూ ఉంటారు. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు.
చిరంజీవి
హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ తర్వాత ఆ కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.
Advertisement
కమల్ హాసన్
మక్కల్ నీది మైయం రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఆయన కంగుతిన్నారు. అయినా సరే రాజకీయాల్లోనే ఆయన కొనసాగుతున్నారు.
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.
విజయశాంతి
తల్లి తెలంగాణ రాజకీయ పార్టీ స్థాపించి ఆ తర్వాత తెరాసలో అడుగుపెట్టి, కాంగ్రెస్, బిజెపిలో జాయిన్ అయ్యారు.
విజయ్ కాంత్
సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న ఈయన, 2005లో దేశీయ ముర్పేక్కు ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు విజయ్ కాంత్.
హరికృష్ణ
సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న హరికృష్ణ.. అన్న టిడిపి పార్టీ పెట్టారు.
Read Also : ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?