Advertisement
సాధారణంగా ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణం చేసే ఉంటారు. మనం ప్రతిరోజు ట్రైన్ ఎక్కుతూ, దిగుతూ ఉంటాం. కానీ అందులో ఉండే కొన్ని విషయాలను అస్సలు గమనించం. అయితే ప్రతి రైలు వెనక “X” అని రాసి ఉండటాన్ని కచ్చితంగా మీరు గమనించే ఉంటారు. మరి అలా ఎందుకు రాసి ఉంటుందో? దాని అర్థం ఏంటో? తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రండి తెలుసుకుందాం.
Advertisement
ప్రతి రైలు బండి వెనుక చివరి కంపార్ట్మెంట్ పై ఈ “X” గుర్తు ఉంటుంది. ఇది సాధారణంగా పసుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తుంది. కదులుతున్న రైలుకు అదే చివరి కోచ్ అని తెలిసేందుకు ఇలా X గుర్తును వేస్తారు. ఒక రైలు మధ్యలో ఏ భోగిని వదలకుండా పూర్తిగా ముందుకు కదిలిందని తెలిపేందుకు ఈ సూచికను వేస్తారు. X గుర్తుతో ఉన్న భోగి రైలు చివర లేనట్లయితే ఆ రైలు ప్రమాదంలో ఉందని సిబ్బందికి సూచిస్తుంది. రైలు క్రాసింగ్ అయ్యే సందర్భంలో డ్యూటీలో ఉన్న గార్డు X మార్కును గుర్తించిన తర్వాతనే రైలు భోగిలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారిస్తూ ఆకుపచ్చ జెండాను చూపిస్తారు.
Advertisement
X గుర్తులేని సమయంలో స్టేషన్ మాస్టర్ అప్రమత్తం అవుతారు. సదరు రైలు ప్రమాదంలో ఉందని గుర్తించి హెచ్చరికను జారీ చేస్తారు. సాధారణ పౌరులు సైతం ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్న రైలు బోగి చివర X గుర్తు లేనట్లయితే సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కు వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. అయితే X గుర్తుతో పాటు చివర కోచ్ వెనుకగా LV అని కూడా రాసి ఉంటుంది. దాని అర్థం “లాస్ట్ వెహికల్” అని. ఈ రెండింటితో పాటుగా ఒక చిన్న రెడ్ లైట్ కూడా కనిపిస్తుంది. ఇది రాత్రి సమయంలో సమయాల్లో చివరి భోగిని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.
READ ALSO : “మైసూర్” ని కాదని “బెంగళూర్” నే కర్ణాటక రాజధానిగా ఎందుకు చేసారు ?